Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

Advertiesment
romance

ఠాగూర్

, శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (10:59 IST)
తమ దేశ పౌరులకు అగ్రదేశం అమెరికా ఓ విజ్ఞప్తి చేసింది. చైనాలో ఉండే అమెరికా పౌరులు డ్రాగన్ కంట్రీకి చెందిన అమ్మాయిలు మహిళలతో మాత్రం ప్రేమ, శారీరక సంబంధాలు పెట్టుకోవద్దని కోరింది. చైనీయులతో ప్రేమ, పెళ్లి, శారీరక సంబంధాలు ఏర్పరచుకోవద్దని చైనాలోని తమ ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని కూడా హెచ్చరించింది. 
 
చైనాలో అమెరికా మిషన్ కోసం పన చేస్తున్న సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు, భద్రతాపరమైన అనుమతులున్న కుటుంబ సభ్యులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిని విధుల నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది. కాగా, ఇటీవల చైనాలో అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్‌ ఈ యేడాది జనవరిలో తన బాధ్యతల నుంచి వైదొలగిన వెంటనే ఈ ఆదేశాలు వెలువడ్డాయి. 
 
బెంగాల్‌లో 25 వేల టీచర్ నియామకాలు రద్దు 
 
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. గత 2016లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నియమించిన 25 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం బెంగాల్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేశాయి. ఈ వ్యవహారంపై బెంగాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, గట్టిదెబ్బ తగిలింది. ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పునిచ్చింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25 వేల టీచర్ నియామకాలు చెల్లవంటూ తీర్పునిచ్చింది. పైగా, గతంలో ఇదే కేసులో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ధర్మాసనం సమర్థించింది. 
 
కాగా, ఈ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌పై గత యేడాది ఏప్రిల్ నెలలో కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. 2016లో నిర్వహించిన స్టేల్ లెవల్ టెస్ట్ ద్వారా చేపట్టిన 25,753 టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. పైగా, దీనికింద ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులందరూ తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిన్నింటినీ కలిపి విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)