Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్-పాక్ దేశాలు చర్చలకే ప్రాధాన్యం ఇవ్వాలి... కాశ్మీర్ అంశాన్ని పరిశీలిస్తున్నాం: బాన్ కీ మూన్

భారత్-పాకిస్థాన్‌ను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ చర్చలకు ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, చర్చల ద్వారా సమస్య

Advertiesment
UN Chief Ban Ki-moon Calls For India
, గురువారం, 22 డిశెంబరు 2016 (09:24 IST)
భారత్-పాకిస్థాన్‌ను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ చర్చలకు ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని బాన్ కీ మూన్ వ్యాఖ్యానించారు.
 
దక్షిణాసియా దేశాల్లో శాంతియుత పరిస్థితులు ఉంటేనే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉంటుందని చెప్పిన మూన్.. చర్చలకే భారత్-పాక్ దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ నెలాఖరులో బాన్‌ కీ మూన్‌ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బాన్‌ కీ మూన్‌ తరుపున ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి ఫరాన్‌ హక్‌ ఈ ప్రకటనను విడుదల చేశారు. 
 
భారత్‌లో సరిహద్దు వద్ద మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అయినా ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి చూసి చూడనట్లు వ్యవహరిస్తోందంటూ ఓ పాక్‌ జర్నలిస్టు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఐరాస ప్రకటనలో.. కాశ్మీర్ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఐరాసపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని.. తాము అన్నింటిని పరిశీలిస్తున్నామని.. ఎప్పటికప్పుడు ప్రకటనలు కూడా చేస్తూనే ఉన్నామన్నారు. పాక్‌- భారత్‌ దేశాల మధ్య చర్చలకు బాన్‌ కీ మూన్‌ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త సంవత్సర కానుక... ఏపీలో తగ్గనున్న ఆర్టీసీ టిక్కెట్‌ ధరలు...