Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త సంవత్సర కానుక... ఏపీలో తగ్గనున్న ఆర్టీసీ టిక్కెట్‌ ధరలు...

కొత్త సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గనున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ యాజమాన్యం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ... అధికారికంగా ఓ ప్రకటన వెలువ

Advertiesment
apsrtc
, గురువారం, 22 డిశెంబరు 2016 (09:21 IST)
కొత్త సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గనున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ యాజమాన్యం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ... అధికారికంగా ఓ ప్రకటన వెలువడాల్సి ఉంది. డీజిల్‌ ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చు అధికం అంటూ బస్‌టిక్కెట్ల ధర పెంచే ఏపీఎస్ఆర్టీసీ తాజాగా టిక్కెట్ ధరలను తగ్గించనుంది.
 
అది కూడా గ్రామీణ ప్రయాణీకులకు, పట్టణాల్లో సిటీ బస్సుల్లో తిరిగే వారికి. నష్టాల బాట నుంచి ఆర్టీసీని గట్టేక్కించేందుకు ఎండీ పూనం మాలకొండయ్య గత కొన్ని రోజులుగా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అందులో కీలకమైనది ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) అని, అందులో బాగా తగ్గిపోతున్నవి తెలుగు వెలుగు బస్సుల్లో అని తేలింది. అందుకు ప్రధాన కారణం డీజిల్‌ ఆటోలుగా తేలడంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు, రవాణాశాఖ అధికారులతో ఆర్టీసీ అధికారులు ఉమ్మడిగా ప్రయత్నం చేశారు. 
 
అయితే బస్‌ చార్జీలో తేడా వల్లే ఎక్కువమంది ఆటోలను ఆశ్రయిస్తున్నారని తమ పరిశీలనలో తేలింది. దీంతోపాటు డిపో మేనేజర్లు సైతం బస్సుల్లో రెండు స్టేజీలకు రూ.6టిక్కెట్‌ అయితే ఆటోల్లో ఐదు రూపాయలే తీసుకొంటున్నారని వివరించారు. రూపాయి తగ్గితే కండక్టర్‌ అనుమతించడు. ఇది ఆటోలకు అనుకూలంగా మారి, ఆర్టీసీకి శాపమైంది. ఈ రెండింటితో పాటు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఎండీకి అక్కడ కొన్ని విషయాలు తెలిశాయి. 
 
మూడు స్టేజిల వరకూ ఐదు రూపాయల టిక్కెట్టు, ఆరేడు స్టేజిల వరకూ పది రూపాయల టిక్కెట్‌ విధానం అమలు గురించి తెలుసుకున్నారు. దీంతో ఆర్టీసీలో గ్రామీణ ప్రాంత సర్వీసులైన తెలుగు వెలుగులు, పట్టణ ప్రాంత సర్వీసుల్లో కనీస టిక్కెట్లు ధరను కొత్త సంవత్సరం నుంచి ఐదు రూపాయలకు తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ఎండీ మాలకొండయ్య అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడ్రస్ అడిగిన పాపానికి ఓ వివాహితను చున్నీ లాగారు.. కర్రతో చావబాదారు.. తలకు గాయమై రక్తం కారుతున్నా?