Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడ్రస్ అడిగిన పాపానికి ఓ వివాహితను చున్నీ లాగారు.. కర్రతో చావబాదారు.. తలకు గాయమై రక్తం కారుతున్నా?

అడ్రస్ అడిగిన పాపానికి ఓ జంటను నడిరోడ్డుపై విచక్షణ రహితంగా చావబాదిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఓ జంట తామ

Advertiesment
Mainpuri Ladki Ke sath Sare Aam Chhedkhani aur Pitai Full Video
, గురువారం, 22 డిశెంబరు 2016 (09:00 IST)
అడ్రస్ అడిగిన పాపానికి ఓ జంటను నడిరోడ్డుపై విచక్షణ రహితంగా చావబాదిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఓ జంట తాము వెళ్లాల్సిన అడ్రస్ కోసం రద్దీగా ఉన్న ఓ మార్కెట్లో కొందరిని అడిగారు.

ఈ లోపు ఓ దుండగుడు అక్కడికి వచ్చిమహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె చున్నీలాగి అవమానించాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ భర్త అతడిని వారించాడు. అంతే.. అప్పటికే అక్కడికి వచ్చిన మరో ఇద్దరితో కలిసి దుండుగుడు రెచ్చిపోయాడు.
 
పొడవాటి కర్ర తీసుకుని భార్యాభర్తలపై విరుచుకుపడ్డాడు. కర్రతో ఇష్టం వచ్చినట్టు దాడికి పాల్పడ్డాడు. మహిళ అని కూడా చూడకుండా గొడ్డును బాదినట్టు బాదాడు. మహిళ తలకు తీవ్ర గాయమై రక్తం కారుతున్నా చుట్టూ వున్నవారంతా చూస్తూ నిలబడిపోయారే తప్ప ఒక్కరూ దుండగులను వారించలేదు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకరిని ఆనంద్ యాదవ్‌గా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేయని పక్షంలో తాను ఆత్మహత్యకు పాల్పడతానని బాధిత మహిళ పోలీసులను హెచ్చరించింది. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికీ ఒక్కరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నాడీఎంకేలో కుమ్ములాటలు.. లీకు వీరులు శశికళ వర్గీయులేనా?