Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పసిఫిక్ మహాసముద్రంలో భీకర టైఫూన్ - గంటకు 230 కిమీ వేగంతో గాలులు

Pacific Ocean
, మంగళవారం, 25 జులై 2023 (13:31 IST)
తుఫానులకు పుట్టినిల్లుగా పేరుగడించిన పసిఫిక్ మహాసముద్రంలో భీకర టైఫూన్ ఒకటి ఆవిర్భవిస్తుంది. తొలుత తుఫానుగా ఏర్పడి ఇపుడు శక్తిమంతమైన తుఫాన్ (టైఫూన్‌)గా మారింది. దీని ప్రభావం కారణంగా గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని ఫిలిప్పీన్స్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఫిలిప్పీన్స్ దీవులకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ టైఫూన్‌కు డోక్సురి అని నామకరణం చేశారు.
 
ఇది రాగల కొన్ని గంటల్లో సూపర్ టైఫూన్ స్థాయికి బలపడనుందని ఫిలిప్పీన్స్ వాతావరణ సంస్థ 'పగాసా' వెల్లడించింది. దీని ప్రభావం ఫిలిప్పీన్స్, తైవాన్, హాంకాంగ్‌తో పాటు చైనాపైనా తీవ్ర స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తోంది. డోక్సురి తొలి పంజాను ఫిలిప్పీన్స్ దీవుల్లో అత్యధిక జనాభా కలిగి ఉండే లూజాన్ దీవిపై విస్తరించనుంది. ఇది కొన్ని గంటల్లోనే దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాన్ని కలిగిస్తుందని భావిస్తున్నారు. 
 
బుధవారం నాటికి డోక్సురి సూపర్ టైఫూన్‌గా మారే అవకాశాలున్నాయని, దాంతో 36 సెంటిమీటర్లకు పైగా కుంభవృష్టికి దారితీస్తుందని, 250 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీస్తాయని ఫిలిప్పీన్స్ వాతావరణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో పలు దీవుల్లో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. ఈ వారంతం నాటికి తైవాన్, హాంకాంగ్, చైనాలపై డోక్సురి విరుచుకుపడుతుందని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ-హెచ్ విద్యార్థి...