Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జల్సాల కోసం భార్యతో వ్యభిచారం చేయించిన భర్త... విటుడి చేతిలో హతమయ్యాడు!

Advertiesment
Turkish
, సోమవారం, 9 మే 2016 (09:45 IST)
జల్సాల కోసం భార్యతో వ్యభిచారం చేయించిన భర్త చివరికు విటుడి చేతిలో హతమ‌య్యాడు. ఈ సంఘటన ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఇస్తాంబుల్‌కు చెందిన‌ అబ్దుల్ తురాన్ (26) డబ్బు సంపాధించడానికి భార్య కాగ్లాను వ్యభిచార కూపంలోకి బలవంతంగా దింపాడు. అంతేకాదు అతనే తన భార్యని కస్టమర్లతో బేరం మాట్లాడి ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తేవారి వద్దకు పంపిచేవాడు.
 
ఇలా భార్య వ్య‌భిచారం చేసి వచ్చే డబ్బుతో తురాన్ జ‌ల్సాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. కాగ్లా తన కస్టమరైన సహిన్ అనే ఖరీదైన కస్టమర్‌తో  ప్రేమలో పడిపోయింది. దీంతో తిరిగి భర్తతో తిగిరి వెళ్లడానికి ఇష్టం పడని కాగ్లా సహిన్‌తోనే ఉండిపోయింది. 
 
కాగ్లా చేస్తున్న పనికి ఆవేశం చెందిన తురాన్... సహిన్‌ను నిలదీశాడు. తన భార్యను తిరిగి పంపమన్నాడు. తన భార్యను వెనక్కి ఇవ్వమని, దీనికి ఎక్కువ డబ్బు చెల్లించాలని బెదిరించడంతో సహిన్ తన స్నేహితులతో కలిసి అతడిని కాల్చి చంపేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టర్గీలో 55 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల హతం