టర్కీ భద్రతాదళాలు సిరియాలోని అలెప్పొ ప్రావిన్స్‌లో జరిపిన దాడుల్లో దాదాపు 55 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి చెందారని టర్కీ భద్రతా దళాలు వెల్లడించాయి. టర్కీ దళాలు శనివారం మూడు వాహనాలతోపాటు మూడు రాకెట్ ఇన్‌స్టాలేషన్‌లను కూడా ధ్వంసం చేశాయని జిన్‌హుయా న్యూస్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది.
ఉత్తర సిరియాలో సంకీర్ణ దళాలు వేర్వేరుగా జరిపిన దాడుల్లో దాదాపు 48 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు టర్కీ దళాలు 2,144 ఐఎస్ స్థావరాలను ధ్వంసం చేసి దాదాపు 807 మంది ఉగ్రవాదులను హతమార్చింది. కాగా, టర్కీలో గత కొన్ని రోజులుగా ఇసిస్ తీవ్రవాదులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య అంతర్యుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే.