Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫేస్‌బుక్‌ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌...తుపాకితో పొట్టపై కాల్చుకుని..

ప్రేమించమని అమ్మాయిల వెంట పడడం, ఆ అమ్మాయి ప్రేమను తిరస్కరించగానే....తాను చనిపోవడమో లేదా ఆ అమ్మాయిని చంపడమో చేయడం కామన్ అయిపొయింది. ఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఆత్మహత్యలు చేసుకునేవారు..ఇప్పుడు మాత్ర

ఫేస్‌బుక్‌ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌...తుపాకితో పొట్టపై కాల్చుకుని..
, శనివారం, 15 అక్టోబరు 2016 (15:16 IST)
ప్రేమించమని అమ్మాయిల వెంట పడడం, ఆ అమ్మాయి ప్రేమను తిరస్కరించగానే....తాను చనిపోవడమో లేదా ఆ అమ్మాయిని చంపడమో చేయడం కామన్ అయిపొయింది. ఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఆత్మహత్యలు చేసుకునేవారు..ఇప్పుడు మాత్రం అందరూ చూస్తుండగానే తమ ప్రాణాలను వదులుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే టర్కీలో చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ, తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారుల్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే... ఎర్డొగాన్ సెరెన్ అనే 22 ఏళ్ల యువకుడు టర్కీ దక్షిణ ప్రాంతంలోని ఉస్మానియే ఫ్రావిన్స్‌లో కుటుంబంతో కలిసి ఓ అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనను ఎవరూ గుర్తించడం లేదని, ప్రేమించిన అమ్మాయీ కూడా ఛీ కొట్టిందని చెప్పుకొచ్చాడు. ప్రేయసి దూరమైతే నిజంగా తాను చనిపోతానని తన స్నేహితులతో చాలా సార్లు చెప్పానని, అయితే ఎవ్వరూ తన మాటలను నమ్మేవారు కాదని, తనది నిజమైన ప్రేమ అని నిరూపించుకునేందుకే ఈ పని చేస్తున్నానంటూ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి, "నేను ఆత్మహత్య చేసుకుంటానని చెబితే ఎవరూ నమ్మట్లేదు. 
 
ఇదిగో చూడండి" అంటూ తుపాకి బ్యారల్‌ను తన పొట్టపైకి పెట్టుకున్నాడు. అంతకుముందు తన గర్ల్ ఫ్రెండ్‌ను ఉద్దేశించి ఓ కవిత కూడా చెప్పాడు. తనను వీడిపోతుంటే, చేతులు తెగ్గోసినట్లుందని, తన ప్రేమ అమరమని చెప్పుకున్నాడు. తుపాకీ పేలుడు చప్పుడు తరువాత కెమెరా పక్కకు వాలిపోయింది. కాల్పుల శబ్ధం తర్వాత ఫేస్ బుక్ లైవ్ ఆగిపోయింది. తుపాకి పేలుడు శబ్దం విన్న కుటుంబసభ్యులు పరుగుపరుగున అతని గదికి వెళ్లేసరి రక్తపు మడుగులో కనిపించాడు. ఆసుపత్రికి తరలించిన కొద్ది గంటలకే ఎర్డొగాన్ ప్రాణాలు విడిచాడు. కాగా, ఈ వీడియోను తొలగించినట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరు కొత్త మిత్రుల కంటే పాత మిత్రుడే ఉత్తమం.. మోడీ :: భారత్‌-రష్యాల మధ్య డీల్స్ ఇవే