Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు కొత్త మిత్రుల కంటే పాత మిత్రుడే ఉత్తమం.. మోడీ :: భారత్‌-రష్యాల మధ్య డీల్స్ ఇవే

భారత్, రష్యాల దోస్తీ మరింత బలపడింది. గోవా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక

Advertiesment
India - Russia deals
, శనివారం, 15 అక్టోబరు 2016 (15:11 IST)
భారత్, రష్యాల దోస్తీ మరింత బలపడింది. గోవా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 
 
బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు గోవాకు వచ్చిన పుతిన్‌తో నరేంద్ర మోదీ శనివారం సమావేశమయ్యారు. భారత్‌, రష్యా 16 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పారిశ్రామిక అభివృద్ధి, రక్షణ రంగంలో ఒప్పందాలు చేసుకున్నాయి. నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైళ్లపై రష్యాతో భారత్‌ ఒప్పందం చేసుకుంది.
 
అనంతరం మోడీ, పుతిన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరు దేశాలు ఉజ్వల భవిష్యత్‌ దిశగా సాగుతున్నాయని మోడీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రష్యా అండగా ఉందని మోడీ గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఇరు దేశాలు ఒకే వైఖరి అవలంభిస్తున్నాయన్నారు. ఇద్దరు కొత్త మిత్రుల కంటే పాత మిత్రుడే ఉత్తమమన్నారు. కాగా, భారత్, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాలను పరిశీలిస్తే... 
 
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీ ఏర్పాటుకు రవాణా వ్యవస్థకు సహకారం
2. ఆంధ్రప్రదేశ్‌లో షిప్ బిల్డింగ్
3. హర్యానాలో స్మార్ట్ సిటీస్ నిర్మాణం
4. ఇరు దేశాల మధ్య గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి సంయుక్త అధ్యయనం
5. రాస్‌నెఫ్ట్, ఎస్సార్, ఓఎన్జీసీల మధ్య డీల్
6. మౌలికవసతుల నిధి
7. రైల్వేల అభివృద్ధి
8. కామోవ్ కేఏ226 హెలికాప్టర్ల తయారీ
9. ఇస్రోతో ఒప్పందం
10. ద్వైపాక్షిక వ్యాపారంపై ఎంఓయూ
11. సైంటిఫిక్ డెవలప్‌మెంట్‌పై ఎంఓయూ
12. పెట్రోలియం ఎనర్జీ
13. అంతర్జాతీయ సమాచారం యొక్క రక్షణ
14. నాలుగు ఫ్రిగేట్ (వార్ షిప్)ల కొనుగోలు
15. కూడంకుళం అణుకేంద్రంలో మరో రెండు రియాక్టర్ల నిర్మాణం వంటి ఉన్నాయి.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెస్ట్ బెంగాల్ : రూ.250 కోట్ల విలువైన పాము విషం స్వాధీనం