Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ ఐటీ పరిశ్రమపై ట్రంప్ పిడుగుపాటు.. హెచ్-1బి నిబంధనలు కఠినతరం

పాతికేళ్ల బారత ఐటీ ప్రస్థానంలో భారీ పిడుగుపాటు. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం సంతకం చేశారు. ఈ చర్యతో భారతీయ వైద్య, ఇంజనీరింగ్ కాలేజీలనుంచి వేలాది మంది విద్

Advertiesment
భారతీయ ఐటీ పరిశ్రమపై ట్రంప్ పిడుగుపాటు.. హెచ్-1బి నిబంధనలు కఠినతరం
హైదరాబాద్ , బుధవారం, 19 ఏప్రియల్ 2017 (05:08 IST)
పాతికేళ్ల బారత ఐటీ ప్రస్థానంలో భారీ పిడుగుపాటు. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం సంతకం చేశారు. ఈ చర్యతో భారతీయ వైద్య, ఇంజనీరింగ్ కాలేజీలనుంచి  వేలాది మంది విద్యార్థులు అమెరికాకు ఉద్యోగాల నిమిత్తం వెళతున్న ప్రక్రియపై ట్రంప్ తిరుగులేని దెబ్బ వేశారు.


మంగళవారం అధ్యక్షుడు పెట్టిన సంతకంతో భారతీయ ఐటీ పరిశ్రమకు పెనుదెబ్బ తగిలినట్లే అని ఐటీ నిపుణులు అంటున్నారు.దీంతో ఉద్యోగాల కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా ఉంటుంది. అమెరికన్లకే అత్యధిక వేతనం.. అత్యధిక ఉపాధి కల్పించాలన్న తన లక్ష్యం నెరవేర్చుకోవడంలో భాగంగా ట్రంప్‌ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు అత్యున్నత నైపుణ్యం ఉన్నవారే రావాలని మిగతా మామూలు ఉద్యోగాలు మొత్తంగా అమెరికన్లకే దక్కాలనే ట్రంప్‌ ఆశయం చాలావరకు దీంతో నెరవేరినట్లే మరి. 
 
వీసా నిబంధనల్లో చేసిన ఈ మార్పులకు తోడు కార్మిక.. న్యాయ.. హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగాలను కూడా అప్రమత్తం చేశారు. అమెరికావాసుల ఉద్యోగాలను తన్నుకుపోయే విదేశీయులపై కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు ఇకనుంచి కచ్చితంగా అమలు చేయనున్నారు. 
 
అమెరికా అధ్యక్షుడి కార్యనిర్వాహక సంతకం ఉద్దేశాన్ని యుస్ అధికారులు మీడియాకు వివరించారు. ప్రస్తుత వీసా ప్రోగ్రాంలో భాగంగా అమరికాలోకి అడుగుపెడుతున్న వారిలో 80 శాతం మంది అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారని, వీళ్లు అమెరికన్ ఉద్యోగుల అవకాశాలను కొల్లగొట్టడమే కాకుండా అతి తక్కువ జీతాలకు పనిచేస్తూ దోపిడీకు గురవుతున్నారని అధికారుల చెప్పారు. 
 
కానీ తగిన విద్యార్హతలు, ప్రమాణాలు లేనప్పటికీ బాడీ షాపింగ్‌లో భాగంగా అమెరికాలోకి ఇండియన్ కంపెనీలు తీసుకొస్తున్న వారి సంఖ్య అమెరికన్ ప్రభుత్వం చెబుతున్నంత అధిక స్థాయిలో లేదని, అమరికాలో చాలా కాలంగా ఉంటున్న నిపుణ కార్మికుల కొరతను పావులిస్ట్ ప్రచారంతో మరుగుపర్చి లాభం లేదని భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలు సవాలు చేస్తున్నాయి. పైగా హె-1బి ఉద్యోగులకు తాము తక్కువ జీతాలు ఇస్తున్నామంటూ చేస్తున్న ప్రచారం సరైంది కాదని వాపోతున్నాయి.
 
అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్‌1బీ వీసాలు ఇవ్వాలనే ఫెడరల్‌ శాఖలు ఈ నిబంధనలను సూచించాయి. వీటిని ప్రత్యేక విధులకే మాత్రమే కేటాయిస్తారు. వీటిల్లో కూడా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండాలి. శాస్త్రవేత్తలు.. ఇంజినీర్లు.. కంప్యూటర్‌ ప్రోగ్రామర్లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. 65 వేల వీసాలు జారీ చేయడానికి ప్రభుత్వం లాటరీ విధానాన్ని ఎన్నుకుంది. మరో 20వేల వీసాలను గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్‌ వర్కర్లకు కేటాయిస్తారు.
 
ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత ఏడాది 2,36,000 ఉండగా.. ఈ సారి 1,99,000లకు మాత్రమే పరిమితమైంది. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న వారిని నియమించుకోవడానికే హెచ్‌1బీ వీసాలను వినియోగిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. ఫేస్‌బుక్‌ వంటి కంపెనీల్లో 15 శాతం మంది ఉద్యోగులు ఈ తాత్కాలిక వీసాలనే వినియోగించుకుంటున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దినకరన్‌కి 9 మంది ఎమ్మెల్యేల మద్దతు: శశికళ బలం ఇంతేనా.. అందుకే ఔట్