Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటీష్ రాణి బంగారు గుర్రపు బగ్గీలో డొనాల్డ్ ట్రంప్.. ఆ కోరిక నెరవేరుతుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తూ.. వలసవాదులను నియంత్రించేందుకు కొత్త నిబంధనలను అమలు చేశారు. అమెరికన్లను ఉద్యోగాల కోసం అవుట్ సోర్సింగ్‌పై కూడా కట్ చేశారు. తాజాగా సిరియాపై దాడి..

బ్రిటీష్ రాణి బంగారు గుర్రపు బగ్గీలో డొనాల్డ్ ట్రంప్.. ఆ కోరిక నెరవేరుతుందా?
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (09:56 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తూ.. వలసవాదులను నియంత్రించేందుకు కొత్త నిబంధనలను అమలు చేశారు. అమెరికన్లను ఉద్యోగాల కోసం అవుట్ సోర్సింగ్‌పై కూడా కట్ చేశారు. తాజాగా సిరియాపై దాడి.. ఉత్తర కొరియాకు బుద్ధి చెప్పేందుకు సన్నద్దమైన డొనాల్డ్ ట్రంప్‌కు ఓ గొప్ప కోరిక ఉందని తెలిసింది.

అందేంటంటే.. బ్రిటీష్ రాణి ప్రయాణించే బంగారు గుర్రపు బగ్గీలో ప్రయాణించాలనేదే. కానీ గుర్రపు బగ్గీలో వెళ్తే డొనాల్డ్ ట్రంప్‌కు భద్రత కల్పించడం కష్టతరమవుతుందని లండన్ భద్రతాధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్రంప్ బ్రిటన్‌లో పర్యటించే అవకాశం ఉంది. 
 
ఈ పర్యటన సందర్భంగా ట్రంప్ కోరికను నెరవేర్చాలనుకున్నప్పటికీ భద్రత విషయమే అధికారులు కలవరపెడుతోంది. రాణి నివాసం ఉండే బకింగ్ హామ్ ప్యాలెస్‌కు భారీ భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో ట్రంప్‌ను తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆ ప్రత్యేక వాహనం కాకుండా, బంగారు వర్ణంలో ఉండే రాణి గారి గుర్రపు బగ్గీని ఏర్పాటు చేయాలని వైట్ హౌస్ అధికారులు పట్టుబడుతుండటంతో.. భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పన్నీరు పక్కా పావులు... మెత్తబడిన సీఎం పళనిస్వామి... ఓపీఎస్ వెనుక ఉన్న ఆ అదృశ్యశక్తి ఎవరు?