Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్‌కు ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టం.. కానీ కొలెస్ట్రాల్ మాత్రం..?

Advertiesment
ట్రంప్‌కు ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టం.. కానీ కొలెస్ట్రాల్ మాత్రం..?
, శనివారం, 9 ఫిబ్రవరి 2019 (10:14 IST)
అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ విధానాలు విమర్శలకు తావిస్తున్నాయి. తాను చేయడమే కరెక్ట్ అంటూ తన దారి ప్రత్యేకమంటూ ట్రంప్ నడుస్తుంటారు. ఎవరేమి చెప్పినా పెద్దగా పట్టించుకోరు. అలాంటి మనిషి ఇటీవల వైద్యుల మాట కూడా పెడచెవిన పెడుతున్నారట. అమెరికా చీఫ్ ట్రంప్‌కు ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. 
 
ఇలా ఫాస్ట్ ఫుడ్‌ను బాగా లాగించి లాగించి కొలెస్ట్రాల్‌ను ట్రంప్ పెంచేసుకున్నారట. 72 ఏళ్ల ట్రంప్‌ను కొలెస్ట్రాల్ తగ్గించే దిశగా సలహాలిచ్చారు వైద్యులు. వైద్య పరీక్షల అనంతరం ట్రంప్‌కు డైట్, ఎక్సర్ సైజ్ ప్లాన్‌ను వైద్యులు ఇచ్చారు. అయినా వాటిని ట్రంప్ పట్టించుకోవట్లేదు. ఎంత చెప్పినా ట్రంప్ వినిపించుకోవట్లేదని.. వైద్యుల సూచనలను పక్కనబెట్టి.. నోటికి రుచికరమైన ఫాస్ట్‌ఫుడ్‌ను లాగిస్తున్నారని వైద్య బృందం వాపోతోంది. 
 
తన ఆహారపుటలవాట్లను మార్చుకోవడానికి ట్రంప్ ఇష్టపడటం లేదని అన్నారు. వైట్‌హౌస్‌లో ఉన్న ఫిట్‌నెస్ రూమ్‌లోకి ఆయన ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదని, ఎక్సర్‌సైజ్ అంటే వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అంటున్నారని వైద్యులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఝాన్సీ ఐఫోన్‌ అన్‌లాక్ చేస్తే.. ఏమైనా సమాచారం లభిస్తుందేమో..