Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

Advertiesment
narendra modi - donald trump

సెల్వి

, బుధవారం, 29 అక్టోబరు 2025 (21:51 IST)
భారతదేశంతో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తనకు భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల గౌరవం, ప్రేమ వుందన్నారు. మోదీతో గొప్ప సంబంధం వుందని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదని ట్రంప్ కొనియాడారు. 
 
"ప్రధాని మోదీ ఓ అద్భుత నాయకుడు. ఓ కిల్లర్.. చాలా ధైర్యవంతుడు కూడా. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు ఓ పట్టాన ఒప్పుకోలేదు. కాల్పులను విరమించాలని నేను కోరగా.. కుదరదని తేల్చి చెప్పారు. మేము పోరాడతామని స్పష్టం చేశారు. అప్పుడు నేను ట్రేడ్ డీల్ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది.." అని ట్రంప్ వివరించారు. 
 
ఇరు దేశాలు పోరాడుతున్నంత కాలం వారితో ఎటువంటి ట్రేడ్ డీల్స్ ఉండబోవని, వ్యాపారం చేయబోమని కరాఖండిగా చెప్పానని, ఆ తర్వాతే భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కాదు, కూడదు అంటే 250 శాతం టారిఫ్ విధిస్తానని భారత్, పాకిస్తాన్‌లను బెదిరించానని ట్రంప్ తేల్చి చెప్పారు. 
 
ఆ తర్వాత 48 గంటల్లోనే ఇరు దేశాలు కాల్పుల విరమణ జరిగిందని చెప్పారు. సౌత్ కొరియాలో ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమిట్‌కు ముందు మాట్లాడిన ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి