Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేలాది ఏళ్లుగా గుహల్లోనే నివసిస్తున్న గిరిజన తెగలు. మండువేసవిలో ఏసీలా ఉంటాయట

చీమలు కట్టుకునే పుట్టలు ఎండాకాలం ఏసీ లాగానూ, చలికాలం హీటర్ లాగానూ పనిచేస్తాయి. గాలి బయటకు వెళుతూ, లోపలికి వస్తూ ఉండే ఒక సహజమైన శీతల నిర్మాణం చీమల పుట్టకే సొంతం. మరి మనిషి అలా కట్టుకోలేడు కదా. కానీ దీనికి పరిష్కారం కూడా ఆలోచించాడు కాబట్టే భూగర్భంలో గు

Advertiesment
వేలాది ఏళ్లుగా గుహల్లోనే నివసిస్తున్న గిరిజన తెగలు. మండువేసవిలో ఏసీలా ఉంటాయట
హైదరాబాద్ , గురువారం, 25 మే 2017 (05:50 IST)
చీమలకు ఏసీలు అవసరం లేదు. కృత్రిమ చల్లదనాలు అవసరమే లేదు. ఎందుకంటే చీమలు కట్టుకునే పుట్టలు ఎండాకాలం ఏసీ లాగానూ, చలికాలం హీటర్ లాగానూ పనిచేస్తాయి. గాలి బయటకు వెళుతూ, లోపలికి వస్తూ ఉండే ఒక సహజమైన శీతల నిర్మాణం చీమల పుట్టకే సొంతం. మరి మనిషి అలా కట్టుకోలేడు కదా. కానీ దీనికి పరిష్కారం కూడా ఆలోచించాడు కాబట్టే భూగర్భంలో గుహలను ఎంచుకున్నాడు. మనం నాగరికత అలవర్చుకుని భవంతుల్లోకి ఆకాశ హర్మ్యాలలోకి వచ్చేశాం కానీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లోని గిరిజనలు ఇప్పటికీ సహజ ఏసీ లాంటి వాతావరణాన్ని ప్రకృతిలోని ఎంచుకుని నిక్షేపంలో కూల్‌గా జీవిస్తున్నారు. ఆ భూగర్భ గుహలు ఇప్పుడు పర్యాటక శోభను కూడా సంతరించుకున్నాయి మరి.
 
అసలు విషయం ఏమిటంటే. మండే వేసవి నుంచి రక్షణ పొందడానికి ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల గిరిజనులు గుహల్లోనే నివసిస్తున్నారు. ఆ గుహలు నిన్నా మొన్నా తొలిచినవి కావు. కొన్ని వేల సంవత్సరాలుగా అవి కొనసాగుతూనే ఉన్నాయి దక్షిణ ట్యునీషియా దేశంలోని మట్‌మటాలోనూ అలాగే గుహల్లో నివసిస్తున్నారు. అయితే అవన్నీ కృత్రిమ గుహలు కావు.. ప్రజలే భూగర్భంలో ఈ గుహలను తవ్వుకొని నివసిస్తున్నారు. మండుటెండల్లోనూ ఈ గుహల్లో అహ్లాదకరంగా ఉంటుందట.
 
ఈ గుహల ఏర్పాటుకు ముందుగా పెద్ద బావిలాంటి గొయ్యిని తవ్వుతారు. అనంతరం దాని లోపలి నుంచి చుట్టూ సొరంగంలా తవ్వి తమకు నచ్చినట్టుగా ఇళ్లను ఏర్పాటు చేసుకుంటారు. అందులోనే పెరటిని ఏర్పాటు చేసుకుని చెట్లను కూడా పెంచుతారు. ఈ నివాసాలు నిన్నమొన్న ఏర్పడినవి కావు. వీటికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. లిబియా, ట్యునీషియా దేశాల సరిహద్దులోని మట్‌మటా ప్రాంతంలో ఈ భూగర్భ నివాసాలు ఎక్కువగా కనిపిస్తాయి. 
 
మొదట్లో బెర్బర్స్‌ తెగకు చెందినవారు వీటిని ఏర్పరచుకునేవారు. కొన్నేళ్లకు అరబ్‌ నుంచి అక్కడకు వలసవచ్చిన కొంతమంది బెర్బర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని.. వారితోపాటే ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వారి రాకతో బెర్బర్స్‌కి కూడా మరింత బలం చేకూరినట్లైంది. దీంతో ఆ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోగలిగారు. ప్రస్తుతం ఈ భూగర్భ నివాసాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో అక్కడి ప్రజలకు జీవనోపాధి కూడా దొరుకుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్వేతసౌధంలో ఇంకా అడుగుపెట్టని మెలానియా.. ట్రంప్‌కి మరోసారి అవమానం