Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్వేతసౌధంలో ఇంకా అడుగుపెట్టని మెలానియా.. ట్రంప్‌కి మరోసారి అవమానం

సందేహమే లేదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లే ఉంది. విదేశీ పర్యటనల్లో ట్రంప్‌కు కాస్త దూరంగా జరుగుతున్న మెలానియా తన భర్త వ్యవహారంలో బాగా గాయపడినట్లే స్పష్టమవుతోంది. మొన్న ఇజ్రాయిల్ రాజధాని టెల్

Advertiesment
శ్వేతసౌధంలో ఇంకా అడుగుపెట్టని మెలానియా.. ట్రంప్‌కి మరోసారి అవమానం
హైదరాబాద్ , గురువారం, 25 మే 2017 (03:52 IST)
సందేహమే లేదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లే ఉంది. విదేశీ పర్యటనల్లో ట్రంప్‌కు కాస్త దూరంగా జరుగుతున్న మెలానియా తన భర్త వ్యవహారంలో బాగా గాయపడినట్లే స్పష్టమవుతోంది. మొన్న ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవాలో ఆట్టహాసంగా విమానం దిగిన ట్రంప్ తన సతీమణి మెలానియా చేయి పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు చాల్చాల్లేవోయ్ అంటూ ఆయన చేతిన విసిరి కొట్టినప్పుడే అధ్యక్ష దంపతుల మధ్య ఏదో జరిగిందని తెలిసిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆయన సతీమణి మెలానియా బహిరంగంగానే ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు కన్పిస్తున్నారు. ఇప్పుడు రోమ్‌లో కూడా అలాంటి ఘటనే జరగటం లేనిపోని వదంతులకు దారితీస్తోంది.
 
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశాల్లో పర్యటిస్తున్న ట్రంప్‌.. మెలానియాతో కలిసి రోమ్‌ చేరుకున్నారు. విమానం ల్యాండ్‌ అవగానే.. ఇద్దరూ అభివాదం చేశారు. ఆ తర్వాత ట్రంప్‌ మెలానియా చేయి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే మెలానియా మాత్రం అదేమీ పట్టనట్లు చేతితో జుత్తు సవరించుకుంది. ఈ ఘటనతో ఇబ్బందిపడ్డ ట్రంప్‌ వెంటనే తన చేత్తో మెలానియా వెన్ను తట్టి సందర్భాన్ని కవర్‌ చేశారు. ఇది కూడా ఇప్పుడు మీడియాకు చిక్కి వైరల్‌గా మారింది.
 
అయితే మెలానియా ఇలా కావాలని చేశారో, లేదా యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు గానీ.. ఇప్పుడు ట్రంప్‌ జంట నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి తోడు ట్రంప్‌ అధ్యక్షుడై నెలలు గడుస్తున్నా మెలానియా ఇంకా శ్వేతసౌధంలోకి మారకపోవడం కూడా వారి మధ్య విబేధాలు ఉండొచ్చనే అనుమానాలకు తావిస్తున్నాయి. దీంతో మెలానియా ట్రంప్‌ను పట్టించుకోవట్లేదని నెటిజన్లు తెగ కామెంట్లు చేసేస్తున్నారు. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆయన సతీమణి మెలానియా ఈ మధ్య బహిరంగంగానే ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు కన్పిస్తున్నారు. ఇటీవల ఇజ్రాయెల్‌ పర్యటనలో ట్రంప్‌ చేయి అందిస్తే మెలానియా విదిలించుకున్న తీరు కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి సందర్భమే చోటుచేసుకుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దెబ్బ కొడితే తరతరాలూ అబ్బా అనేలా బదులిస్తాం.. పాక్ వైమానిక దళ చీఫ్ హెచ్చరిక