ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌ను నెలకొల్పి 130 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలు ఆకాశాన్ని తాకేలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఈ ఐకానిక్ టవర్ వద్ద పారిస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.
కళ్లు మిరిమిట్లు గొలిపేలా లేజర్ షోని ఏర్పాటు చేసింది. 1889లో వరల్డ్ ఫెయిర్ ప్రదర్శన కోసం నిర్మించిన ఈఫిల్ టవర్ 324 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది, అలాగే 7300 టన్నుల బరువు కలిగి ఉంటుంది.
కాగా ప్రతి ఏటా కనీసం 70 లక్షల మంది టూరిస్ట్‌లు ఈఫిల్ టవర్‌ని సందర్శిస్తుంటారు. ఫ్రాన్స్ దేశానికే తలమానికంగా నిలిచిన ఈ టవర్‌ని 1889లో నిర్మించిన తర్వాత కొన్నేళ్లకే కూల్చివేయాలంటూ ప్రతిపాదనలు వచ్చాయంటే ఆశ్చర్యపోక తప్పదు. ఇప్పుడు ఇదే ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ దేశానికి కొన్ని కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.