Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాచకుటుంబం నుంచి రాజకీయాల్లోకా? అబ్బే.. వద్దే వద్దు.. థాయ్ రాజు

రాచకుటుంబం నుంచి రాజకీయాల్లోకా? అబ్బే.. వద్దే వద్దు.. థాయ్ రాజు
, శనివారం, 9 ఫిబ్రవరి 2019 (14:50 IST)
థాయ్‌లాండ్‌లో వచ్చే నెల జరుగునున్న ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా థాయ్‌లాండ్ రాజు సోదరి యుబోల్‌రటానా మహిడోల్ పోటీ చేయడంపై ఆ దేశ రాజు స్వాగతించలేదు. రాజకీయాల్లో రాజ కుటుంబీకులు రాణించవచ్చునని యుబోల్‌రటానా సమర్థించడంపై థాయ్ రాజు ఖండించారు.


67 ఏళ్లైనప్పటికీ యుబోల్‌రటానా రాజకీయాల్లోకి రావడం.. వంశపారంపర్యంగా రాజకీయాల్లోకి దూరంగా వున్న రాచకుటుంబానికి విరుద్ధమని థాయ్ రాజు పేర్కొన్నారు. 
 
రాచకుటుంబానికి చెందిన వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ఆ దేశ పారంపర్యానికి, సంస్కృతికి విరుద్ధమని వజ్రలాంగ్‌కోర్న్ రాజు ప్రకటనలో తెలిపారు. అయితే యుబోల్‌రటానా పీఎమ్ అభ్యర్థిగా నిలవడం ఆమె వ్యక్తిగత వ్యవహారమని.. ప్రజాస్వామ్యంలో ఇది సహజమేనని సామాజిక మాధ్యమాలు కోడైకూస్తున్నాయి. ఉన్నత పదవిలో రాజకుటుంబానికి చెందిన వ్యక్తి వుంటే ప్రజలకు మేలే జరుగుతుందని సోషల్ మీడియాలో యుబోల్‌రటానాకు మద్దతిస్తున్నాయి.
 
కానీ ఐదేళ్ల క్రితం సైన్యంతో రాచరిక పాలనకు గండికొట్టిన ప్రభుత్వం, పార్టీతోనే యుబోల్‌రటానా పోటీ చేయనుండటాన్ని రాజకుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. మాజీ పీఎమ్ థక్సిన్ శినవత్ర పార్టీ తరపునే యుబోల్‌రటానా పీఎమ్ అభ్యర్థిగా బరిలోకి దిగనుంది. ఓ అవినీతి కేసు నుంచి తప్పించుకునేందుకు థక్సిన్ శినవత్ర 2008వ సంవత్సరం నుంచి థాయ్ నుంచి బహిష్కరించబడి.. దుబాయ్‌లో నివసిస్తున్నారు. 
 
అప్పట్లో ఆ ప్రధాన మంత్రి పదవిలో వున్న థక్సిన్‌తో సోదరి ఇంగ్లక్ గత 2014వ సంవత్సరం సైనిక పోరాటం జరిగేందుకు కొన్ని వారాల క్రితం ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఇంగ్లక్‌కు రైతులకు బియ్యం సరఫరా సబ్సిడీ వ్యవహారంలో ఏర్పడిన అవినీతి కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 2017లో ఈ శిక్ష ఖరారైంది.
webdunia


అయితే శిక్ష పడేందుకు ముందే ఆమె దేశం వీడింది. అలాంటి అవినీతి పార్టీ తరపున రాజకుటుంబానికి చెందిన యువరాణి అయిన యుబోల్‌రటానా పీఎం అభ్యర్థిగా బరిలోకి దిగడం ప్రస్తుతం వివాదాస్పదమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందరి భవిష్యత్తును 'మోది' అంధకారం చేశారు... చంద్ర‌బాబు