Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అటు జాతి వివక్షా హత్యలు.. ఇటు స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు.. ఏమైంది మనవాళ్లకు!

మొన్న కూచిభట్ల శ్రీనివాస్, నిన్న ఎన్నారై తల్లీ కుమారుల దారుణ హత్య, ఇవ్వాళ మరో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. బతకడం కోసం భూతల స్వర్గంకు వెళ్లినవారు బతుకు చాలించుకుంటున్నారు. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మధురెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడ

Advertiesment
అటు జాతి వివక్షా హత్యలు.. ఇటు స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు.. ఏమైంది మనవాళ్లకు!
హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (03:05 IST)
అమెరికాలో మన ఎన్నారైలకు ఏమైంది? జాతి వివక్షా దాడులకూ వాళ్లే బలవుతున్నారు. రంగు భేదంతో బయట కనిపిస్తే చాలు దాడులకు దిగడమే కాకుండా సవాలు చేసి మరీ కాల్చిపడేస్తున్నారు. మరోవైపున డాలర్లతో జీవితాన్ని పండించుకోవాలని నిజాయితీగానే శ్రమించి బతకాలని కొండంత ఆశలను ముందుంచుకుని వెళ్లిన వారూ అక్కడ బతకలేక, ఒత్తిడి తట్టుకోలక నిలువునా ఆశలు వ్రయ్యలు చేసుకుని తమవాళ్లను అనాథలను చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 
మొన్న కూచిభట్ల శ్రీనివాస్, నిన్న ఎన్నారై తల్లీ కుమారుల దారుణ హత్య, ఇవ్వాళ మరో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. బతకడం కోసం భూతల స్వర్గంకు వెళ్లినవారు బతుకు చాలించుకుంటున్నారు. తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మధురెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. సియాటెల్లో సాప్ట్‌వేర్ ఇంజినీర్గా పనిచేసున్న మధురెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా రాళ్ల జనగామ. మధురెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. 
 
మధురెడ్డికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు కానీ, వివాదాలు కానీ లేవని బంధువులు చెబుతున్నారు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై స్పష్టత లేదు. మధురెడ్డి బలవన్మరణంతో అతని స్వస్థలంలో విషాదం నెలకొంది.
 
అమెరికన్ డాలర్ల స్వప్నం ఇక ముగిసిన కథేనా..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలో అత్యద్భుతమైనది 'రతి' అంటున్న అందాల ఆడబొమ్మ...