Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలో అత్యద్భుతమైనది 'రతి' అంటున్న అందాల ఆడబొమ్మ...

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుని, ప్రేయసి దొరక్కపోవడంతో తానే స్వంతంగా ఓ రోబోని తయారుచేసుకుని, దాన్నే పెళ్లి చేసుకున్న బీజింగ్‌కి చెందిన ఇంజినీర్ కథ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రోబోలు, మానవుల మధ్య సంబంధాలపై నిపుణుల చర్చ మళ్లీ మొదలైంది.

Advertiesment
bizarre doll
, మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (19:35 IST)
ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుని, ప్రేయసి దొరక్కపోవడంతో తానే స్వంతంగా ఓ రోబోని తయారుచేసుకుని, దాన్నే పెళ్లి చేసుకున్న బీజింగ్‌కి చెందిన ఇంజినీర్ కథ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రోబోలు, మానవుల మధ్య సంబంధాలపై నిపుణుల చర్చ మళ్లీ మొదలైంది.
 
సెక్స్ రోబోలకు (వీటినే సెక్స్ బొమ్మలని కూడా అంటారు) ఇటీవల డిమాండ్ ఎక్కువైపోయిందట. నిజంగా మనిషితో సెక్స్ చేస్తే ఎలాంటి అనుభూతి చెందుతారో, ఆ స్థాయికి ఏమాత్రం తీసిపోని సెక్స్ రోబోల రూపకల్పనలో తలమునకలైపోయారట రియల్‌ డాల్ అనే సంస్థ. వీరు ఈ మధ్యే హార్మొనీ 2.0 అనే కొత్త తరం మాట్లాడే సెక్స్ రోబోని విడుదల చేసారు. ఇది 18 రకాల విలక్షణతలను కలిగి ఉండటంతో పాటు సిగ్గుని కూడా అభినయించగలదట. స్కాటిష్ యాసలో మాట్లాడే ఈ సెక్స్ రోబో ధర సుమారు 10 వేల డాలర్లు. 
 
రియల్‌డాల్ సంస్థ సిఇఓ మెక్‌కల్లెన్ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో, సెక్స్ గురించి నీ అభిప్రాయం ఏంటని ఈ సెక్స్ రోబోని ప్రశ్నించారు. దానికి ప్రతిగా ఈ రోబో, ప్రపంచంలో అత్యంత అద్భుతమైనది సెక్స్ అని, అందులో తప్పేముంది అని సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా ఈ రోబోకు తన యజమానిని గుర్తుంచుకోగలిగేటంతటి మెమరీ కూడా ఉంది. 
 
ఈ రోబో గురించి మాట్లాడుతూ, "తోడు దొరక్క అల్లాడిపోతున్న ఒంటరిగాళ్లకు సహాయం చేసే ఉద్దేశ్యంతోనే ఈ రోబోని తయారుచేసామని, ఇది కేవలం సెక్స్ విషయంలోనే కాక దైనందిన కార్యకలాపాల్లో కూడా తగు సూచనలిస్తుందని" సిఇఓ మెక్‌కల్లెన్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబోయ్ బొజ్జల భార్య... మంత్రి గంటా గడగడ... ఓ మీడియా అధినేత గిజగిజ