Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైవ్ స్ట్రీమింగ్.. ఇద్దరు యువతుల దుర్మరణం.. డ్రైవ్ చేస్తూ చాటింగ్.. ఢీకొన్న ట్రాక్టర్

అమెరికా యువతపై సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు.. బాగానే పడింది. సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ వంటి ఫీచర్స్ ఉండటంతో కార్లు నడుపుకుంటూ.. వీడియో కాల్‌లో మాట్లాడటం వంటివి చేస్తూ ప్రమాదాలకు గురవుతున్

Advertiesment
Teenage girls live stream own death in car crash
, శనివారం, 10 డిశెంబరు 2016 (16:56 IST)
అమెరికా యువతపై సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు.. బాగానే పడింది. సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ వంటి ఫీచర్స్ ఉండటంతో కార్లు నడుపుకుంటూ.. వీడియో కాల్‌లో మాట్లాడటం వంటివి చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న లైవ్ స్ట్రీమింగ్‌తో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే.. అంతకుముందు.. ప్రియుడితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ఓ యువతి పోలీసు కారును ఢీకొని అడ్డంగా బుక్కయ్యింది. 
 
తాజాగా ఇద్దరు టీనేజీ యువతులు ఫేస్ బుక్ లైవ్ ఛాటింగ్ చేస్తూ రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బ్రూక్ మిరండా హ్యూస్, చనియా మారిసన్ గత మంగళవారం రాత్రి తమ కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వారు ఫేస్ బుక్ లైవ్ వీడియో చాట్ చేస్తున్నారు.
 
ఇంతలో ఓ ట్రాక్టర్ కారు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన 8 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చాటింగ్‌లో అవతల వైపు ఉన్న వ్యక్తి వీరికి ఏం జరిగిందో అర్థంకాక కంగారుపడ్డారు. చివరికి తమ వద్ద ఉన్న వీడియోతో తన ఫ్రెండ్స్ చనిపోయారని గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో ఇద్దరు యువతుల మృతదేహాలు కాలిపోయాయని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శేఖర్ రెడ్డి 'గోల్డ్ కింగ్' అవుతారా? 175 కిలోల బంగారం లభించింది... ఇంకా ఏయే మాళిగల్లో ఎంతుందో?