శేఖర్ రెడ్డి 'గోల్డ్ కింగ్' అవుతారా? 175 కిలోల బంగారం లభించింది... ఇంకా ఏయే మాళిగల్లో ఎంతుందో?
జస్ట్ కొద్ది గంటల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడయిపోయిన శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ సిబ్బంది దాడులు చేస్తుంటే డబ్బేమో కట్టలు కట్టలు దొరుకుతోంది... ఇక బంగారం అయితే కిలోల లెక్కన బయటపడుతోంది. వ్యవహారం చూస్తుంటే అయ్యగారు దాచిపెట్టిన బంగ
జస్ట్ కొద్ది గంటల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడయిపోయిన శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ సిబ్బంది దాడులు చేస్తుంటే డబ్బేమో కట్టలు కట్టలు దొరుకుతోంది... ఇక బంగారం అయితే కిలోల లెక్కన బయటపడుతోంది. వ్యవహారం చూస్తుంటే అయ్యగారు దాచిపెట్టిన బంగారం టన్నుకు చేరుకుంటుందేమోనని అనుమానం వ్యక్తమవుతోంది. గత రెండురోజుల కిందట స్వాధీనం చేసుకున్న 100 కిలోల బంగారంతోపాటు తాజాగా ఆయన వద్ద మరో 75 కిలోల బంగారం వెలుగుచూసింది. మొత్తం 175 కిలలో బంగారాన్ని ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఇంటి ముందు కాస్త దూరంగా ఆగి ఉన్న కారులో ఏకంగా రూ.24 కోట్లు లభించాయి. అందుకే ఆయన ఇంటి పరిసరాల్లో ప్రతి వస్తువును గాలిస్తున్నారు ఐటీ సిబ్బంది. ఏ వస్తువులో ఏముంటుందో ఎవరికి తెలుసు...? బంగారం ఉండవచ్చు... నగదు ఉండవచ్చు... లేదంటే వజ్ర వైఢూర్యాలు ఉండవచ్చు. శేఖర్ రెడ్డా మజాకా...!!