Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షంజ్‌పీర్‌లో తాలిబన్ల మారణహోమం మొదలు

Advertiesment
షంజ్‌పీర్‌లో తాలిబన్ల మారణహోమం మొదలు
, శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:11 IST)
ఆప్ఘనిస్థాన్ దేశంలోని ప్రావీన్స్‌లలో ఒకటైన షంజ్‌పీర్‌లో తాలబన్ల మారణహోమం మొదలైంది. ఇక్కడ తాలిబన్ తీవ్రవాదులు పెట్రోగిపోతున్నారు. ఈ లోయలను ఇటీవలే తాలిబన్ తీవ్రవాదులు తమ వశం చేసుకున్నారు. ఆ తర్వాత తమకు వ్యతిరేకగా పని చేసిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా ఇంటింటి తనిఖీలకు చేపట్టారు. ఆ తర్వా తమ చేతికి చిక్కిన వారిని చేతికి చిక్కినట్టు హతమార్చుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రెండు రోజులుగా తాలిబన్లు సృష్టిస్తున్న మారణహోమాన్ని ఆపేందుకు అంతర్జాతీయ సమాజంతోపాటు ఐక్యరాజ్య సమితి +ముందుకు రావాలని అక్కడి నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
 
"ఎన్‌ఆర్‌ఎఫ్‌ బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారీ ప్రాణనష్టాన్ని చవిచూసిన తర్వాత ఇక్కడి పౌరులను ఊచకోత కోసే ప్రక్రియను తాలిబన్లు మొదలు పెట్టారు. ఈ మారణహోమానికి సరిహద్దులో జరిగిన నేరాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 
 
ముఖ్యంగా నిరాయుధులైన సామాన్య పౌరులపై చేస్తున్న దాడులు, హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర సంస్థలు తాలిబన్ల చర్యలను కట్టడి చేయాలి. అంతేకాకుండా వారికి సహకరిస్తున్న విదేశీ శక్తులను కూడా ఈ నేరాలకు బాధ్యులుగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ' అని పంజ్​షేర్​ నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం - ఆరేళ్ల పాల అత్యాచారం