కుప్వారోలో లష్కరే కమాండర్ అరెస్ట్.. ఆప్ఘనిస్థాన్‌లో 60 మందిని అపహరించిన తాలిబన్స్!
జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఓ కమాండర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. మంగళవారం దక్షిణాది ప్రావిన్స్ హెల్మాండ్‌లో కాబూల్
జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఓ కమాండర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. మంగళవారం దక్షిణాది ప్రావిన్స్ హెల్మాండ్‌లో కాబూల్-హెరాత్ హైవేపై వెళ్తున్న మూడు వాహనాలను సాయుధ తాలిబన్ టెర్రరిస్టులు అడ్డగించారు.
రెండు ట్రక్కులు, ఓ బస్సులో ప్రయాణిస్తోన్న వారిని తాలిబన్లు బందీలుగా చేసుకుని.. సమీపంలోని గ్రామాల్లోకి తీసుకెళ్లినట్లు భద్రత దళాలు తెలిపాయి. ఇక బందీలను విడిపించడం కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు హెల్మాండ్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ అఖా నూర్ కెంటోజ్ వెల్లడించారు. కాగా 60 మంది ప్రయాణికులను విచారణ కోసం తీసుకెళ్లినట్టు తాలిబన్ ప్రతినిధి ఖారి యూసుఫ్ అహ్మది వెల్లడించాడు.
మరోవైపు జమ్మూ, కుప్వారా జిల్లా పరిధిలోని లోలబ్ ప్రాంతంలో సొగమ్ మార్కెట్లో పోలీసులు లష్కరే తోయిబా కమాండర్‌ను అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి లష్కరె తోయిబా ఉగ్రవాదిగా గుర్తించారు. ఆపై అతడిని అబూ ఉకాషా అలియాస్ పాకిస్థాన్‌కు చెందిన హన్జుల్లా అని ధ్రువీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద ఒక గ్రనైడ్, రూ.38వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.