Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త ఫార్ములా... ఇప్పుడు లవ్.... తర్వాత రేప్... ప్రేమ వెనుక కామం...

అందమైన అమ్మాయి. ఆమెను ఎలాగైనా బుట్టలో వేయడమే లక్ష్యం. నాలుగైదు నెలలు లవ్వాయణం. అదను చూసి అత్యాచారం. ఇదీ ఇప్పుడు యువతులను నమ్మించి గొంతు కోస్తున్న కొందరు యువకుల దారి. ఇలాంటివి ఇటీవలి కాలంలో ఎక్కువయిపోయ

Advertiesment
Love aaj
, మంగళవారం, 21 జూన్ 2016 (16:44 IST)
అందమైన అమ్మాయి. ఆమెను ఎలాగైనా బుట్టలో వేయడమే లక్ష్యం. నాలుగైదు నెలలు లవ్వాయణం. అదను చూసి అత్యాచారం. ఇదీ ఇప్పుడు యువతులను నమ్మించి గొంతు కోస్తున్న కొందరు యువకుల దారి. ఇలాంటివి ఇటీవలి కాలంలో ఎక్కువయిపోయినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ముందు ఆమె ప్రేమ కోసం పరితపిస్తారు. పిచ్చివాడిలా తిరుగుతారు. ఆఖరికి అతడు తనకోసం ప్రాణాలర్పిస్తాడన్న స్థాయికి తీసుకెళ్లడంతో సదరు యువతి అతడికి మనసును అర్పించేస్తుంది. ఆ తర్వాత కథ మొదలవుతుంది. 
 
కొన్నాళ్లపాటు వేచి చూసే ధోరణి. పార్టీలు, పబ్బులు, సినిమాలకు తిరిగినా ఎప్పుడూ ఎక్కడా టచ్ చేయడు. ఆమె పూర్తిగా తన అధీనంలోకి వచ్చేసిందని తెలుసుకున్న తర్వాత ఓ మంచి ముహూర్తం చూసుకుని సుదూర ప్రాంతాలకు ఓ బస్సు టిక్కెట్టో, రైలు టిక్కెట్టో కొనేసి ఆమెను అలా యాత్రకు తీసుకెళ్లిపోతాడు. అక్కడ విహార యాత్ర కాస్తా మరో రకమైన యాత్రగా మారిపోతుంది. తనపై ఎంతో ప్రేమ ఒలకబోసిన ప్రియుడు కామాంధుడుగా మారిపోయి అత్యాచారానికి పాల్పడి ఆనక ఆమెను వదిలేసి పారిపోతున్న సంఘటనలు ఎక్కవవుతున్నాయి. 
 
కొన్నిచోట్ల తను మాత్రమే కాకుండా తన స్నేహితులను కూడా పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. అందువల్ల... ప్రేమ అంటే గుడ్డిగా నమ్మేసి అతడి వెంట వెళ్లొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రేమ వెనుక కామం ఉంటుందని కూడా గ్రహించి సుదూరు ప్రయాణాల ఆఫర్ల వంటివి తిరస్కరించి... సాధ్యమైనంత వరకూ పెళ్లితో శుభం కార్డు పడ్డాక ప్రయాణాలు బెటర్ అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్‌లో పరువు హత్యలు: భర్తను కాల్చేశారు.. తల్లీ బిడ్డను గొడ్డలితో నరికేశారు!