Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంజాబ్‌లో పరువు హత్యలు: భర్తను కాల్చేశారు.. తల్లీ బిడ్డను గొడ్డలితో నరికేశారు!

పరువు హత్యలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. పరువు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే వారు చివరికి సునాయాసంగా హత్యలు కూడా చేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు మ

Advertiesment
Man killed by wife's family in rare 'male honour killing' in Pakistan
, మంగళవారం, 21 జూన్ 2016 (16:31 IST)
పరువు హత్యలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. పరువు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే వారు చివరికి సునాయాసంగా హత్యలు కూడా చేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిని కూడా పరువు పేరుతో దారుణంగా హతమార్చారు. పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు కుటుంబ పెద్ద నోట్లో తుపాకీ పెట్టి మూడు రౌండ్ల బుల్లెట్లతో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఇక అతడి భార్య, నాలుగేళ్ల కుమారుడి తలలను గొడ్డలితో నరికేశారని పోలీసులు తెలిపారు. ఇక సంఘటన జరిగిన స్థలానికి సమీపంలో ఒక మోటర్ సైకిల్, కాస్మోటిక్స్ ఉన్న పర్సు లభించాయని, ఇది పరువు హత్యే అయి ఉండొచ్చనని అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడితో పాటు మృతి చెందిన వారిద్దరూ పిల్లాడికి తల్లిదండ్రులా అనేది నిర్ధారించేందుకు రక్త నమూనాలను డీఎన్‌ఏ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నారా... మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ కాలం కరిగిపోద్ది...