మిస్టర్ ట్రంప్ మీరెప్పుడేనా.. 24 గంటలు ఆహారం, నీరు లేకుండా ఉన్నారా?.. నేను ఉగ్రవాదినా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. శరణార్థులను అమెరికాలో రానీయకుండా నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణంయపై సిరియా చిన్నారి ట్రంప్‌ను ట్విట్టర్ ద్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. శరణార్థులను అమెరికాలో రానీయకుండా నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణంయపై సిరియా చిన్నారి ట్రంప్‌ను ట్విట్టర్ ద్వారా నిలదీసింది. 'మిస్టర్ ట్రంప్.. మీరెప్పుడైనా 24 గంటల పాటు ఆహారం లేకుండా ఉన్నారా? సిరియాలోని శరణార్థులు, చిన్నారుల గురించి ఒక్కసారి ఆలోచించండి' అంటూ సిరియాలోని ఏడేళ్ల బాలిక బానా అలాబెద్ డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించింది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కారణంగా నిత్యం యుద్ధంతో అట్టుడికే అలెప్పో నగరంలో తమ పరిస్థితి గురించి బానా అలాబెద్ తన తల్లి ఫాతిమా సహాయంతో హృదయాన్ని కలిచివేసే ట్వీట్లు చేస్తూ అందరికీ తెలియజేస్తోంది. 2016 సెప్టెంబరు నుంచి అలాబెద్ ట్విట్టర్‌కు 3,66,000 మంది ఫాలోవర్లు చేరారు. గతంలో వారి ఇల్లు ఎలా కూలిపోయిందో చెప్తూ చేసిన ట్వీట్ ఎందరినో కలిచివేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా సిరియాలోని అలెప్పోలో తమ జీవితం గురించి ట్వీట్ల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. సిరియా సహా ఏడు ముస్లిం మెజార్టీ దేశాలపై వలసదారులు, శరణార్థులను అడ్డుకునేందుకు అమెరికా తాత్కాలిక నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. చెడువారిని అమెరికాకు బయటే ఉంచేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు సరే.. అయితే "నేను ఉగ్రవాదినా?అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది.
'డియర్ ట్రంప్, శరణార్థులను నిషేధించడం చాలా చెడ్డ విషయం. సరే, ఒకవేళ అదే మంచిదైతే.. నా దగ్గర ఓ ఆలోచన ఉంది. మీరు ఇతర దేశాలను శాంతియుతంగా మార్చండి' అంటూ బానా ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.