Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఫీసు టైమ్‌లో గంట సేపు భార్యతో లైంగిక చర్యలో పాల్గొనాలి..

ఆధునిక యుగంలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతో సంసారం చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గంటల పాటు ఆఫీసుల్లో గడిపి.. ఆపై ఇంటికొచ్చాక స్మార్ట్ ఫోన్లను చూస్తూ కాలం గడిపేవారు పెరిగిపోతున్నారు. దీంతో

ఆఫీసు టైమ్‌లో గంట సేపు భార్యతో లైంగిక చర్యలో పాల్గొనాలి..
, గురువారం, 23 ఫిబ్రవరి 2017 (09:11 IST)
ఆధునిక యుగంలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతో సంసారం చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గంటల పాటు ఆఫీసుల్లో గడిపి.. ఆపై ఇంటికొచ్చాక స్మార్ట్ ఫోన్లను చూస్తూ కాలం గడిపేవారు పెరిగిపోతున్నారు. దీంతో కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి.

దంపతుల మధ్య ప్రేమ కొరవడుతుంది. అయితే భార్యాభర్తల మధ్య కొరవడుతున్న ప్రేమ, అప్యాయత, వ్యక్తిగత సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు స్వీడన్ దేశానికి చెందిన ఓ కౌన్సెలరు వినూత్న సలహా ఇచ్చాడు.
 
ఆఫీసు పనివేళల్లోనే మధ్యలో ఓ గంట సేపు విరామంలో ఇంటికి వెళ్లి తన జీవిత భాగస్వామితో లైంగికచర్యలో పాల్గొనాలని స్వీడన్ ఉత్తర పట్టణమైన ఓవర్ టోర్నేయాకు చెందిన పెర్ ఎరిక్ ముస్కోస్ సూచించి సంచలనం రేపారు. పనిచేసే సమయం మధ్యలో జీవిత భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారని సెలవిచ్చారు. 
 
మన సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో దంపతులు కలిసి గడిపే సమయం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పని సమయం మధ్యలో జీవిత భాగస్వామితో గడపడం వల్ల దంపతుల మధ్య సత్సంబంధాలు ఏర్పడటమే కాకుండా పని సామర్ధ్యం కూడా పెరుగుతుందని పెర్ ఎరిక్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసిన కోదండరామ్ అరెస్టు