Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టర్కీ పాఠశాలలో కాల్పుల కలకలం ... 8 మంది విద్యార్థులు, ఓ టీచర్ దుర్మరణం

Advertiesment
shooting
టర్కీలో దారుణం జరిగింది. 14 యేళ్ల విద్యార్థి ఒకరు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది విద్యార్థులతో పాటు ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కాల్పులు జరిపిన విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం కహ్రామన్‌మరాస్‌ ప్రావిన్స్‌లోని అయ్సెర్ కాలిక్ మిడిల్ స్కూల్‌లో ఈ విషాదం జరిగింది. 
 
8వ తరగతి చదువుతున్న ఇసా అరాస్ మెర్సిల్లీ అనే విద్యార్థి తన తండ్రికి చెందిన ఐదు తుపాకులతో పాఠశాలకు వచ్చాడు. రెండు తరగతి గదుల్లో వెళ్లి కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 13మంది విద్యార్థులు గాయపడగా, వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని టర్కీ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి ముస్తఫా సిఫ్త్సీ వెల్లడించారు. 
 
నిందితుడి తండ్రి ఉగుర్ మెర్సిన్లీ ఓ మాజీ పోలీస్ అధికారి అని, ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. అయితే, నిందితుడి మృతిపై అధికారులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు తననుతాను కాల్చుని చనిపోయాడా లేక పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడా అనే విషయంపై స్పష్టత రాలేదు. అలాగే, దాడికి గల కారణాలు తెయరాలేదు. కాగా, టర్కీలో రెండు రోజుల వ్యవధిలో స్కూలులో కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తులు ఎలా కొన్నారు... అంత డబ్బు మీకెక్కకిది : ఆస్తులు గుట్టు విప్పని శాంతి...