ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా ఆస్పత్రిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌కు చెందిన మహిళ మొదట పొత్తి కడుపులో నొప్పి, ఆ తర్వాత డయేరియోతో బాధపడుతూ జనవరి 2021లో స్థానిక ఆసుపత్రిలో చేరింది. 2022 నాటికి ఆమెలో క్రమంగా మతిమరుపు రావడం, కుంగుబాటు వంటివి కనిపించాయి. ఆ తర్వాత కాన్‌బెర్రా ఆసుపత్రికి తరలించారు.
ఆమె మెదడును స్కాన్ చేసిన వైద్యులు అసాధారణ స్థితిని గుర్తించారు. దాంతో వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఆశ్చర్యకరంగా ఆమె మెదడు నుండి 8 సెంటీమీటర్ల పరాన్నజీవి (ఏలికపాము)ని బయటకు తీశారు. తమకు తెలిసినంత వరకు మానవ లేదా ఇతర రకాల క్షీరజాతుల మెదడులో ఉన్న మొదటి పరాన్నజీవిగా దీనిని తాము గుర్తించినట్లు సేననాయకే తెలిపారు.
తమ వైద్య వృత్తిలో మొదటిసారి ఇలాంటి దానిని చూశామన్నారు. మెదడులో ఈ పరాన్నజీవిని కలిగి వున్న 64 ఏళ్ల మహిళ న్యూసౌత్ వేల్స్ లోని కార్పెట్ పైథాన్‌లు నివసించే సరస్సు ప్రాంతానికి సమీపంలో ఉంటున్నట్లుగా గుర్తించారు.