Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంకలో ఎమర్జెన్సీ రద్దు - మరింతగా దిగజారిన పరిస్థితులు

sri lanka
, బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:13 IST)
శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ఎత్తివేశారు. అదేసమయంలో ఆ దేశంలో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఆహారం, నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు లభించక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకవేళ నిత్యావర వస్తువుల అందుబాటులో ఉన్నప్పటికీ అవి ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో లంకేయులు ఆకలితో అలమటిస్తున్నారు.
 
మరోవైపు, దేశంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ దేశ అధ్యక్షుడు గొటబయి రాజపక్స విధించిన ఎమర్జెన్సీని రద్దు చేశారు. గత అర్థరాత్రి నుంచి సాధారణ పరిస్థితులు అమల్లోకి వచ్చినట్టు పేర్కొన్నారు. దీనికితోడు అధికార పార్టీ ఆ దేశ పార్లమెంట్‌లో మెజార్టీని కోల్పోయింది. దీంతో అధ్యక్షుడు గొటబయితో పాటు ప్రధానమంత్రి మహింద్ర రాజపక్సేలకు కష్టాలు ఒకదాపై ఒకటి వరుసగా చుట్టుముట్టుతున్నాయి. 
 
లంక రాయబార కార్యాలయాలు మూసివేత
శ్రీలంక పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పలు దేశాల్లోని తమ దేశ రాయబార కార్యాలయాలను మూసివేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోవడంతో దేశంలో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో ఎంపీలు, మంత్రులు ఇళ్ళను ఆందోళనకారులు మొహరించడంతో పరిస్థితి అదుపుతప్పింది. అదేసమయంలో శ్రీలంకలో అమలవుతున్న అధ్యక్ష వ్యవస్థను రద్దు చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. 
 
నిజానికి ఒక పుడు ఎంతో రమణీయమైన దేశంగా పేరుగాంచిన శ్రీలంక ఇపుడు అత్యంత దయనీయ స్థితిలోకి జారుకుంది. పర్యాటకం, ఎగుమతులతో ఉన్నంతలో మెరుగైన జీవనం గడుపుతూ వచ్చారు. కానీ, కరోనా సంక్షోభం, తీవ్ర ఆహార కొరత, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో ప్రభుత్వం పేరుకు మాత్రమే ఉంది. కానీ, ప్రజలకు ఎలాంటి సాయం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో వివిధ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. 
 
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినా ఎవరూ ఖాతరు చేయడం లేదు. విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన వారు వీధుల్లోకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలు పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. పోలీసుల హెచ్చరికలను శ్రీలంక ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. 
 
మరోవైపు, దేశంలో నెలకొన్న అత్యంత దయనీయ పరిస్థితులపై ఆ దేశ విపక్ష నేత సాజిత్ ప్రేమదాస స్పందించారు. శ్రీలంకలో అధ్యక్ష వ్యవస్థ వల్లే ఇలాంటి దుష్పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయని, అధికారాలన్నీ అధ్యక్షుడు వద్దే కేంద్రీకృతం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అందువల్ల దేశంలో అధ్యక్ష వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవాలో దారుణం.. డ్రైవర్ తల, కడుపు భాగంలో కుట్లు..