అమెరికాకు చెందిన వ్యక్తి 150 మంది శిశువులకు తండ్రి అయ్యాడు. ఇదేంటి అని అనుకుంటున్నారా? ఐతే చదవండి. అమెరికా వెర్మాంట్ రాష్ట్రానికి చెందిన జోయ్ డోనార్. అంటే వీర్యాన్ని దానం చేసిం 150 మందికి పిల్లలు తండ్రయ్యాడు. అంతే కాకుండా యూకే వ్యాప్తంగా ఏడాదికి 10 మంది మహిళల గర్భానికి కారణమయ్యాడు.
కోవిడ్-19 తీవ్రంగా ఉన్నప్పటికి అతనికి అది అడ్డు తగలలేదు. 50ఏళ్ల జోయ్ తన అసలు పేరును బయటకు వ్యక్తపరచకుండా తన పని కానిచ్చేస్తున్నాడు. గత మూడు నెలలుగా లండన్‌లోనే నివాసముంటున్న జోయ్ అనేక ఇంటర్వ్యుల్లో పాల్గొన్నాడు. ఎందులోనూ తన పేరును బహిరంగ పరచలేదు.
ఒకరికి జీవితమిచ్చేందుకు మహిళలకు సహాయం చేయడం అన్నింటికంటే ఉత్తమమైందిగా భావిస్తున్నానని అంటున్నాడు జోయ్. తాను ఎల్లప్పుడూ మహిళలు కోరికను నెరవేర్చేందుకు, బిడ్డను కనాలనే వారి కలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు.
మహిళలకు తన స్మెర్మ్ అందించడం వల్ల ఎలాంటి ఆర్థిక లాభం లేదని, కేవలం ప్రజలకు సహాయం చేయడం ద్వారానే తాను ఆనందం పొందుతానని జోయ్ స్పష్టం చేశాడు. అదృష్టవశాత్తు తాను కొన్ని ఆన్ లైన్ వ్యాపారాలను నమ్ముతున్నానని, అందువల్ల తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉండి అవసరమైన వారికి వీర్యాన్ని దానం చేయగలుగుతాన్నానని తెలిపాడు.
జోయ్ అమెరికా, అర్జెంటీనా, ఇటలీ, సింగపూర్, ఫిలిప్పైన్స్, యూకేల్లో పర్యటించి తన వీర్యాన్ని దానం చేశాడు. సెప్టెంబరులో యూకే వచ్చినప్పటి నుంచి జోయ్ దాదాపు 15 మంది మహిళలను కలిశాడు.
వారిలో చాలా మందితో శృంగారం చేయడానికి ఇష్టపడలేదని, అది వారి సంబంధంలో చాలా సమస్యలను కలిగిస్తుందని తెలిపాడు. ఇప్పటివరకు ముగ్గురితోనే లైంగికంగా కలిశానని, వారిలో ఇద్దరు గర్భవతులు అని తెలిపాడు. జోయ్ కథ విన్న చాలామంది ఇతడు మామూలోడు కాదంటూ ముక్కుపై వేలేస్తున్నారు.