Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వణికిపోతున్న అమెరికా.. ఎందుకో తెలుస్తే షాకవుతారు?

వణికిపోతున్న అమెరికా.. ఎందుకో తెలుస్తే షాకవుతారు?
, శుక్రవారం, 11 డిశెంబరు 2020 (09:31 IST)
అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. దీనికి కారణం కరోనా వైరస్. ఇక్కడ కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రారంభమైంది. ఫలితంగా గురువారం ఒక్కరోజే ఏకంగా 3,054 కరోనా మరణాలు సంభవించాయి. అంతకు 24 గంటల ముందు 2,769 మంది కరోనా కాటుకు బలయ్యారు. 
 
18 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 2,10,000 మందికి వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. అమెరికాలో ఇప్పటివరకు 1.50 కోట్ల మంది వైరస్ బారినపడగా, వారిలో 2,86,249 మంది వైరస్‌కు బలైనట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా పలు ఫార్మా కంపెనీలు తయారు చేసిన టీకాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా దెబ్బకు ప్రతి రోజూ వేలాదిమంది మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 
 
మరోవైపు, ఈ ఏడాది చివరినాటికి 20 మిలియన్ల మందికి, జనవరి చివరినాటికి 50 మిలియన్ల మందికి, వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి 100 మిలియన్ల మంది అమెరికన్లకు కొవిడ్ టీకా ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆ దేశ ఆరోగ్య, మానవసేవల కార్యదర్శి అలెక్స్ అజార్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బావమరిది పెళ్లి.. వెళ్లకుంటే భార్య చేతిలో బతకలేను : కానిస్టేబుల్ ఆవేదన