Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రంప్‌ పని పట్టిన రిపబ్లికన్లు: ఒబామా కేర్‌పై చర్చ వాయిదా

ఒబామాకేర్‌ వైద్య పాలసీ స్థానంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆశలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌కు సొంత పార్టీకి చెందిన రిపబ్లికన్‌ సభ్యులే షాకిచ్చారు. అమెరికన్‌ కా

ట్రంప్‌ పని పట్టిన రిపబ్లికన్లు: ఒబామా కేర్‌పై చర్చ వాయిదా
హైదరాబాద్ , శనివారం, 25 మార్చి 2017 (03:36 IST)
ఒబామాకేర్‌ వైద్య పాలసీ స్థానంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆశలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌కు సొంత పార్టీకి చెందిన రిపబ్లికన్‌ సభ్యులే షాకిచ్చారు. అమెరికన్‌ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో గురువారం బిల్లుపై చర్చ సందర్భంగా మెజార్టీ సభ్యులు హాజరుకాకపోవడంతో స్పీకర్‌ చర్చను శుక్రవారానికి వాయిదా వేశారు. దీంతో  బిల్లు ఆమోదానికి తగినంత మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో సర్కారు విఫలమైంది. శుక్రవారం సభ జరగకపోతే సోమవారం చర్చ, ఓటింగ్‌ చేపట్టే వీలుంది.  ట్రంప్‌ రంగంలోకి దిగి బిల్లుకు మద్దతివ్వాలంటూ రిపబ్లికన్‌ పార్టీ సభ్యులకు అల్టిమేటం జారీ చేశారు.
 
రిపబ్లికన్‌ సభ్యులతో భేటీ నిర్వహించి.. బిల్లుకు మద్దతివ్వకపోతే జరిగే పరిణామాల్ని వివరించారు.  ఒబామాకేర్‌తో అధిక వ్యయంతో పాటు తక్కువ సదుపాయాలు అందుతున్నాయని.. ఇది కొనసాగితే పరిస్థితి దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందకపోతే ఇతర మార్గాల్లో దాన్ని ట్రంప్‌ అమలు చేస్తారని వైట్‌హౌస్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌ మిక్‌ ముల్‌వనే హెచ్చరించారు. 
 
అమెరికన్ కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభలో బిల్లుపై చర్చకు ముందు ఈ బిల్లు తప్పక పాస్ అవుతుందని వైట్ హౌస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, అందులో భాగమే ఈ కొత్త వైద్య పాలసీ అని పేర్కొంది. కానీ కాంగ్రెస్‌లోనూ, సెనేట్ లోనూ కూడా ఆధిక్యత ఉన్నప్పటికీ సొంత పార్టీ సభ్యులే గైర్హాజర్ కావడం, డెమాక్రాట్లు సహకరించకపోవడతో బిల్లు ఓటింగుకు రాకుండానే వాయిదా పడింది. 
 
తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హెల్త్ కేర్ రిఫార్మ్ బిల్లు చర్చకే రాకుండా వాయిదా పడటంతో ట్రంప్ అసహనానికి గురయ్యారు. డెమాక్రాట్ల నుంచి మద్దతు రాకపోవడంతో బిల్లు ముందుకు పోలేదని వ్యాఖ్యానించారు. అయితే బిల్లు నెగ్గడానికి తాము చాలా దగ్గరికి వచ్చామని చెబుతూనే సహకరించని డెమాక్రాట్లను నిందించారు. అఫోర్డబుల్ కేర్ యాక్ట్ త్వరలోనే చట్టసభల ఆమోదం పొందుతుందని, ఈ బిల్లును ఆమోదించడానికి డెమాక్రాట్లను కలసిరావలసిందిగా ట్రంప్ ఆహ్వానించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ చేస్తున్నది జాతి వివక్షే.. మరి మనమాటేమిటి? అదేం మనం చేస్తే రైటైపోతుందా?