Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక అమెరికా కుట్ర : షేక్ హసీనా

sheik hasina

ఠాగూర్

, సోమవారం, 12 ఆగస్టు 2024 (17:49 IST)
ఇటీవల తమ దేశంలో చోటు చేసుకున్న అల్లర్ల వెనుక అగ్రరాజ్యం అమెరికా హస్తముందని ఈ అల్లర్ల కారణంగా తన పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. బంగ్లాదేశ్‍‌లో తీవ్ర స్థాయిలో చెలరేగిన నిరసనలు, అల్లర్ల నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రాణ భయంలో దేశం విడిచిన హసీనా.. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన తిరుగు బాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ హసీనా ఈ ఆరోపణలు చేశారు.
 
ఆమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదాన్నేనని, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుండి వైదొలగానని పేర్కొన్నారు. వారు విద్యార్థుల శవాలను దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారని, దానిని తాను సహించలేదన్నారు. ఒకవేళ సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి .. అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్నని, దానికి ఇష్టపడకనే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లుగా పేర్కొన్నారు.
 
తాను బంగ్లాదేశ్‌లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవని, అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకుని వైదొలిగినట్లు చెప్పారు. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని దేశ ప్రజలకు ఆమె చేశారు. ప్రజలే తన బలమని, వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని అన్నారు. తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. వారి కోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం : మాధురిపై పోలీసుల కేసు.. ఎందుకో తెలుసా?