Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

45 ఏళ్ల ప్రియురాలితో 21 ఏళ్ల ప్రియుడు మజాగా శృంగారం... తర్వాత దారుణంగా...

ఆమెకు 45 ఏళ్లు, ఇతడికి 21 ఏళ్లు. తరచూ శృంగారంలో పాల్గొంటూ వుండేవారు. ఐతే అతగాడి మనసు మాత్రం పొద్దస్తమానం క్రైమ్ చుట్టూతా తిరిగేది. అందుకోసం ఆన్ లైన్లో వున్న క్రైం స్టోరీలన్నిటినీ చదువుతుండేవాడు. ఈ క్రమంలో అతడికి ఒక సీరియల్ కిల్లర్ స్టోరీ కంటబడింది. 1

Advertiesment
45 ఏళ్ల ప్రియురాలితో 21 ఏళ్ల ప్రియుడు మజాగా శృంగారం... తర్వాత దారుణంగా...
, శనివారం, 21 జులై 2018 (17:56 IST)
ఆమెకు 45 ఏళ్లు, ఇతడికి 21 ఏళ్లు. తరచూ శృంగారంలో పాల్గొంటూ వుండేవారు. ఐతే అతగాడి మనసు మాత్రం పొద్దస్తమానం క్రైమ్ చుట్టూతా తిరిగేది. అందుకోసం ఆన్ లైన్లో వున్న క్రైం స్టోరీలన్నిటినీ చదువుతుండేవాడు. ఈ క్రమంలో అతడికి ఒక సీరియల్ కిల్లర్ స్టోరీ కంటబడింది. 1978 నుంచి 1991 మధ్య కాలంలో ఓ నరమాంస భక్షకుడు వరసగా 17 మంది పురుషులను, బాలురను చంపిన తీరును అదేపనిగా చదవడం మొదలుపెట్టాడు. అంతే... అతడిలో కూడా నరమాంస భక్షకుడు మేల్కొన్నాడు. 
 
ఓ రోజు తన ప్రియురాలితో శృంగారం చేస్తూ తన మనసులో దాగి వున్న కోర్కెను తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెతో శృంగారం చేస్తున్న సమయంలో బాగా మద్యం తాగించాడు. అలా ఆమె మత్తులోకి జారుకోగానే అతడిలో రాక్షసుడు మేల్కొన్నాడు. వెంటనే కత్తి తీసుకుని ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత ఆమె తలలో వున్న మెదడు బయటకు తీసి దాన్ని ముక్కలు కింద కోసేశాడు. ఆ ముక్కలను వేయించుకుని తినేశాడు. 
 
రష్యాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో నేరం రుజువైతే అతడికి జీవిత ఖైదు పడుతుంది. పిల్లలు ఆన్ లైన్లో ఏమేమి చదువుతున్నారో ఓ కంట కనిపెట్టి వుండటం మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీని కడిగేసిన చంద్రబాబు - మెజార్టీకి - మొరాలిటీకి మధ్య సమరం