Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రమండలంపై పేలిపోలియిన ల్యాండర్!

luna -25 lander
, ఆదివారం, 20 ఆగస్టు 2023 (16:20 IST)
రష్యా దేశం చంద్రమండలం దక్షిణ ధృవం అధ్యయనం కోసం చేపట్టిన ప్రయోగం విఫలమైంది. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన లూనా-25 ప్రయోగం చివరి క్షణంలో విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్ ఆదివారం అధికారికంగా వెల్లడించింది. 
 
లూనా-25లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని తొలుత ప్రకటించిన రష్యా.. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అది కుప్పకూలిపోయినట్టు తెలిపింది. చంద్రుడిపై దిగే సమయంలో ల్యాండర్ క్రాష్ అయినట్టు తెలిపింది. దాదాపు 47 యేళ్ల తర్వాత జాబిల్లిపై పరిశోధనల కోసం లూనా 25ను రష్యా చేపట్టింది. 
 
భారత్ పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-3 చేపట్టిన కొన్ని రోజలకే రష్యా లూనా-25 ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ కంటే ముందే దిగేలా ఈ ప్రాజెక్టు చేపట్టింది. కానీ అది చివరి నిమిషంలో విఫలమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీలో బిజీబిజీగా రజనీకాంత్.. నేడు అఖిలేష్‌తో భేటీ...