Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేట్ టాప్ లెస్ ఫోటోల కేసు.. జర్నలిస్టులకు బిగుస్తున్న ఉచ్చు.. కఠిన శిక్షలు తప్పవా?

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ టాప్ లెస్ ఫోటోల వ్యవహారంలో ఆరుగురు జర్నలిస్టులు చిక్కుల్లో పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యువరాణి టాప్‌లెస్ ఫోటోలను అత్యంత రహస్యంగా తీయడమే కాకుండా, వాటిని తమ మ్యాగజైన్

Advertiesment
Irish designer
, బుధవారం, 26 అక్టోబరు 2016 (15:31 IST)
బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ టాప్ లెస్ ఫోటోల వ్యవహారంలో ఆరుగురు జర్నలిస్టులు చిక్కుల్లో పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యువరాణి టాప్‌లెస్ ఫోటోలను అత్యంత రహస్యంగా తీయడమే కాకుండా, వాటిని తమ మ్యాగజైన్ కవర్ పేజీపై ముద్రించి ప్రచురించడాన్ని ఫ్రెంచ్ కోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఫోటోల ద్వారా రాచకుటుంబం పరువు తీశారని కేట్ న్యాయవాదులు వాదిస్తున్నారు. దీంతో ఆరుగురు జర్నలిస్టులపై విచారణకు కోర్టు సిద్ధమైంది. 
 
ఈ కేసు విచారణ వచ్చే జనవరి నుంచి విచారణ జరుగుతుందని ఫ్రెంచ్ న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే.. 2012లో ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్సెస్ (డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్) కేట్ మిడిల్టన్‌లు హాలిడే కోసం దక్షిణ ఫ్రాన్స్‌లోని ఓ ప్రాంతానికి వెళ్లారు. మూడో మనిషి కూడా అడుగుపెట్టలేని ఆ భవంతిలో.. వీరిద్దరూ చనువుగా ఉన్న సమయంలో క్లోజర్ మేగజీన్‌కు చెందిన జర్నలిస్టులు రహస్యంగా ఫొటోలు తీశారు. 
 
జూమ్ కెమెరాతో కేట్ మిడిల్టన్ టాప్‌లెస్ ఫొటోలను కెమెరాలో బంధించారు. ఆ తర్వాత ఆ ఫొటోలను కవర్ పేజ్‌పై ముద్రించి మ్యాగజైన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. దీనిపై బ్రిటన్ రాచకుటుంబం మండిపడింది. దీంతో పాటు సదరు మ్యాగజైన్ దావా వేసింది. ఈ కేసులో నిందారోపణలు రుజువైతే ఆరుగురు జర్నలిస్టులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో పెళ్ళి ఫోటో షేర్ చేసింది.. పెళ్లైన 2 గంటలకే విడాకులిచ్చేశాడు..