సోషల్ మీడియాలో పెళ్ళి ఫోటో షేర్ చేసింది.. పెళ్లైన 2 గంటలకే విడాకులిచ్చేశాడు..
సోషల్ మీడియా లైఫ్ స్టైల్‌లో భాగమైపోయింది. తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సంస్కృతి ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో పంపించిందని ఆరోపిస్తూ
సోషల్ మీడియా లైఫ్ స్టైల్‌లో భాగమైపోయింది. తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సంస్కృతి ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో పంపించిందని ఆరోపిస్తూ ఓ నవ వరుడు తన భార్యకు విడాకులు ఇచ్చేసిన ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. తన స్నేహితురాలికి తన పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో పంపించిన కారణంతో నవ వధువు జీవితం నాశనమైపోయింది.
వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌లోని ఓ జంటకు పెళ్లి జరిగింది. నవదంపతులు బంధువులతో కలిసి సంతోషంగానే ఉన్నారు. అయితే పెళ్లికి రాలేని తన స్నేహితురాలు పెళ్లి కుమార్తెను ఓ ఫోటో పంపమని చెప్పింది. స్నేహితురాలు అడిగింది కదాని నవ వధువు తన పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న వరుడు.. పెళ్లైన రెండు గంటలకే విడాకులు ఇచ్చేశాడు.
పెళ్లికి తర్వాత సోషల్ మీడియాలో ఎవరితోనూ సంప్రదింపులు ఉండకూడదని, ఫోటోలు షేర్ చేయకూడదని, మెసేజ్‌లు పంపించకూడదనే అగ్రిమెంట్ ఉందని.. నవ వధువు సోదరుడు వెల్లడించాడు. ఆ అగ్రిమెంట్‌ను తన సోదరి ఉల్లంఘించిందనే కారణంతో తన సోదరి జీవితం నాశనమైందని అతను వాపోయాడు.