మిస్ వరరల్డ్ 2016 కిరీటాన్ని కైవసం చేసుకున్న పోర్టారికో భామ
ఈ యేడాది మిస్ వరల్డ్ 2016 కిరీటాన్ని ఈ యేడాది పోర్టారికో భామ కైవసం చేసుకుంది. ఈమె పేరు స్టెఫైన్ డెల్ వాల్లే. వయసు 19 యేళ్లు. వాషింగ్టన్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 116 మంది పాల్గొన్నారు. వీరందరినీ తోసిర
ఈ యేడాది మిస్ వరల్డ్ 2016 కిరీటాన్ని ఈ యేడాది పోర్టారికో భామ కైవసం చేసుకుంది. ఈమె పేరు స్టెఫైన్ డెల్ వాల్లే. వయసు 19 యేళ్లు. వాషింగ్టన్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 116 మంది పాల్గొన్నారు. వీరందరినీ తోసిరాజని వాల్లే అగ్రస్థానంలో నిలిచింది. పోర్టారికో దేశానికి ఈ కిరీటం దక్కడం ఇది రెండోసారి.
కాగా, డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన యరిత్జా, ఇండోనేసియాకు చెందిన నటాషా రన్నరప్‌లుగా నిలిచారు. గతేడాది ప్రపంచసుందరిగా నిలిచిన స్పెయిన్ భామ మిరియా లాలాగుణ విజేతకు కిరీటాన్ని అందజేసింది. ఫైనల్‌కు పోటీ పడిన ఐదుగురిలో కెన్యా, ఫిలీప్పీన్స్ భామలు కూడా ఉన్నారు. విజేతగా నిలిచిన డెల్ వాల్లే తాను వినోద రంగంలోకి రావాలనుకుంటన్నట్లు వెల్లడించింది.