Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా తండ్రి ఆరోగ్యం భేష్... ప్రజాసేవ కోసం యువకుడివలే ముందుకొస్తారు : ఎంకే.స్టాలిన్

మా తండ్రి, డీఎంకే అధినేత కరుణానిధి క్షేమంగానే ఉన్నారని ఆయన తనయుడు, డీఎంకే కోశాధికారి ఎంకే.స్టాలిన్ చెప్పారు. తండ్రి ఆరోగ్యంపై ఆయన తొలిసారి స్పందించారు. కావేరి ఆస్పత్రిలో శ్వాసకోశ సమస్యలతో చికిత్సలు పొ

Advertiesment
మా తండ్రి ఆరోగ్యం భేష్... ప్రజాసేవ కోసం యువకుడివలే ముందుకొస్తారు : ఎంకే.స్టాలిన్
, సోమవారం, 19 డిశెంబరు 2016 (09:51 IST)
మా తండ్రి, డీఎంకే అధినేత కరుణానిధి క్షేమంగానే ఉన్నారని ఆయన తనయుడు, డీఎంకే కోశాధికారి ఎంకే.స్టాలిన్ చెప్పారు. తండ్రి ఆరోగ్యంపై ఆయన తొలిసారి స్పందించారు. కావేరి ఆస్పత్రిలో శ్వాసకోశ సమస్యలతో చికిత్సలు పొందుతున్న తన తండ్రి కరుణానిధి క్షేమంగానే ఉన్నారని, వైద్యులందించే చికిత్సలతో ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగైందని చెప్పారు.
 
నామక్కల్‌ జిల్లా డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నాదురై 108వ జయంతిని పురస్కరించుకుని ఇటీవలే నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆదివారం బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, తమ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2007 నుంచి ఇప్పటివరకు వివిధ పోటీల్లో, పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన కబరిచే విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేస్తున్నామన్నారు. 
 
ఇకపోతే ఇదే వేదికపై నుంచి తండ్రి ఆరోగ్యంపై స్పందిస్తూ... శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యపరిస్థితి మెరుగవుతోందని, వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవలందించేందుకు యువకుడి వల్లే ఆయన ప్రజల ముందుకు వస్తారని స్టాలిన్ తెలిపారు. ఈ మాటతో ఆ వేదిక ప్రాంగణంలో డీఎంకే కార్యకర్తలు జేజేలు కొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో పోటీని తట్టుకునేందుకు రూ.149కే అపరిమిత కాల్స్‌ : బీఎస్ఎన్ఎల్