Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత సైనికుల తలలను మేం నరకలేదు: నఫీస్ జకారియా.. పాక్‌పై యుద్ధానికి మోడీ సర్కార్ ప్లాన్?

భారత సైనికుల తలలను తాము నరకలేదని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా అన్నారు. భారత్ తమపై అనవసరంగా ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత

Advertiesment
Provocative Statements
, శుక్రవారం, 5 మే 2017 (10:45 IST)
భారత సైనికుల తలలను తాము నరకలేదని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా అన్నారు. భారత్ తమపై అనవసరంగా ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని జకారియా వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఐక్యరాజ్యసమితికి భారత్ ఎన్నడూ కట్టుబడి ఉండలేదని నఫీస్ జకారియా అన్నారు. 
 
ఐరాస మిలిటరీ అబ్జర్వర్స్ గ్రూప్‌కు భారత్ ఎన్నడూ కట్టుబడి ఉండలేదని నఫీస్ జకారియా చెప్పారు. అందుచేత తమపై చేస్తున్న ఆరోపణలను ఐక్యరాజ్యసమితి ముందు ఉంచే హక్కు కూడా భారత్‌కు లేదని, ఆ హక్కును భారత్ ఎప్పుడో కోల్పోయిందని నఫీస్ జకారియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో చేస్తున్న దురాగతాలను కప్పిపుచ్చుకోవడానికే.. భారత్ ప్రతిసారి పాకిస్థాన్ కార్డును ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.
 
ఇదిలా ఉంటే.. మే ఒకటో తేదీ (సోమవారం) భారత భూభాగంలోకి పాకిస్థాన్ సైనికులు రావడం.. ఇద్దరు బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్లను పట్టుకుని తల నరికేయడంతో మోడీ సర్కార్ సీరియస్ అయ్యింది. ప్రతీకారం కోసం కేంద్రంలోని మోడీ సర్కారు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. విపక్షాలతో పాటు ప్రజలు కూడా పాకిస్థాన్‌‍పై గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో యుద్ధానికి మోడీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌ చర్యలకు చెక్ పెట్టాలంటే యుద్ధమే పరిష్కారమని మోడీ భావిస్తున్నట్లు తెలిసింది. 
 
రెండు రోజుల క్రితం ఓ కాన్ఫ‌రెన్స్‌లో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ధ‌నోవా మాట్లాడుతూ పాక్‌పై 10 రోజుల పాటు జరిగే యుద్ధానికి త‌గిన ఆయుధాల‌తో సిద్ధంగా ఉండాల‌ని ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు చైనా కూడా క‌వ్వింపు చ‌ర్యల‌కు దిగుతున్నందున డ్రాగ‌న్ కంట్రీని కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని పిలుపు నిచ్చారు. 
 
పాకిస్తాన్ ను అంతమొందించేందుకు భారత సైన్యం ఉవ్విళ్లూరుతోందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్  ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా కాశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేయలేరని పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకు భారత్‌పై నాలుగు సార్లు యుద్ధానికి దిగిన పాకిస్తాన్ అన్నిసార్లూ ఓటమినే చూసిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని స్వామి హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెక్యూరిటీగార్డు సహకరించలేదు.. చంపేశాం... కొడనాడు ఎస్టేట్ దోపిడీ దొంగల వాంగ్మూలం