Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖైదీల్లో మార్పు రావాలంటే 'అది' ఇవ్వాల్సిందేనట...ఎందుకివ్వరంటున్న సీనియర్ ఖైదీ

మీరు మంచి భోజనం పెట్టండి, సౌకర్యాలు కల్పించండి, ఇంకా ఎన్నయినా చేయిండి. మా అసలు అవసరం తీర్చకపోతే మేము ఎందుకు మారాలి. మారను గాక మారము అంటూ హఠం వేసుకు కూర్చున్నాడా సీనియర్ ఖైదీ. ఈ ఖైదీ కోరుతున్న ఆ అవసరం ఏదో తెలుసుకుని జైలు అధికారులు షాక్ తింటుండగా జైలు

ఖైదీల్లో మార్పు రావాలంటే 'అది' ఇవ్వాల్సిందేనట...ఎందుకివ్వరంటున్న సీనియర్ ఖైదీ
హైదరాబాద్ , మంగళవారం, 9 మే 2017 (08:20 IST)
మీరు మంచి భోజనం పెట్టండి, సౌకర్యాలు కల్పించండి, ఇంకా ఎన్నయినా చేయిండి. మా అసలు అవసరం తీర్చకపోతే మేము ఎందుకు మారాలి. మారను గాక మారము అంటూ హఠం వేసుకు కూర్చున్నాడా సీనియర్ ఖైదీ. ఈ ఖైదీ కోరుతున్న ఆ అవసరం ఏదో తెలుసుకుని జైలు అధికారులు షాక్ తింటుండగా జైలు బయటి నుంచి ఆ డిమాండుకు భారీ ఎత్తున సంఘీభావం ఏర్పడటం మరో వింత.
 
ఇంతకూ ఈ సీనియర్ ఖైదీ తన అవసరం పేరుతో జైలు అధికారులను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఖైదీలకు సెక్స్ డాల్స్ కావాలని ప్రచారం చేశాడంతే. జాక్‌ స్వారేజ్‌ అనే ఆయన గతంలో తీవ్రనేరానికి పాల్పడి, ప్రస్తుతం నాటింగ్‌హోమ్‌ షైర్‌లోని లోథమ్‌ గ్రేగ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. చాన్నాళ్లుగా జైలు లోపలి పరిస్థితులను నిశితంగా గమనించిన ఆయన.. సమాజం ఆశించిన మేరకు ఖైదీలలో పరివర్తన రావాలంటే తరచూ శృంగారకార్యకలాపాలకు అనుమతించాల్సిందేనని వాదిస్తున్నాడు. 
 
అందుకే ఖైదీలు సెక్స్‌ డాల్స్‌ను వినియోగించుకునేలా చట్టాలు సవరించాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పైసా ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండదని, ఖైదీల సొంత డబ్బుతోనే రబ్బరు బొమ్మల్ని కొనుక్కునే వీలు కల్పించాలని కోరుతున్నాడు. ఈ మేరకు జైలు వైబ్‌సైట్‌ పేజీలో తన వాదనను వినిపించిన జాక్‌ ను ప్రఖ్యాత బీబీసీ సహా పలు అంతర్జాతీయ చానెళ్లు ఇంటర్వ్యూ చేశాయి. 
 
ఆయా ఇంటర్వ్యూలు చూసిన, చదివినవారిలో అత్యధికులు జాక్‌ వాదనతో ఏకీభవించడం గమనార్హం. ’ఖైదీలకు ఈ మాత్రం అవకాశం కల్పించకపోతే మానసికంగా ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉంటుంది’అని అంటాడు జాక్‌! కాగా, ఇతని డిమాండ్‌పై బ్రిటన్‌ జైళ్ల శాఖ ప్రస్తుతానికైతే స్పందించలేదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతి కేసులో అడ్డంగా బుక్కవుతున్న కేజ్రీవాల్.. ఏసీబీకి సాక్ష్యాలు సమర్పించిన కపిల్ మిశ్రా