Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవినీతి కేసులో అడ్డంగా బుక్కవుతున్న కేజ్రీవాల్.. ఏసీబీకి సాక్ష్యాలు సమర్పించిన కపిల్ మిశ్రా

ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎరుగని సంక్షోభంలో కేజ్రీవాల్ నిండా మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఆప్ మంత్రి వర్గం నుంచి, తర్వాత పార్టీ సభ్యత్వం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా మంచినీటి ట్యాంకర్ల కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్రపై, తోటి మంత్రి నుంచి ముడ

అవినీతి కేసులో అడ్డంగా బుక్కవుతున్న కేజ్రీవాల్.. ఏసీబీకి సాక్ష్యాలు సమర్పించిన కపిల్ మిశ్రా
హైదరాబాద్ , మంగళవారం, 9 మే 2017 (07:56 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎరుగని సంక్షోభంలో కేజ్రీవాల్ నిండా మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఆప్ మంత్రి వర్గం నుంచి, తర్వాత పార్టీ సభ్యత్వం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా మంచినీటి ట్యాంకర్ల కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్రపై, తోటి మంత్రి నుంచి ముడుపులు స్వీకరించడంపై సీబీఐ అధికారాలకు ఫిర్యాదు చేసిన కపిల్ మిశ్రా వీటికి సంబంధించిన సాక్ష్యాల్ని కూడా అందచేయటంతో దేశరాజధానిలో కలకలం చెలరేగింది. పైగా కేజ్రీవాల్‌కు సత్యేంద్ర జైన్ ఇచ్చిన 2 కోట్ల రూపాయల లంచంపై సీబీఐకి ఫిర్యాదు చేయడానికి మంగళవారం 11.30 గంటలకు అపాయింట్‌మెంట్ తీసుకోవడంతో కేజ్రీవాల్ అరెస్టుకు కూడా ప్రాతిపదిక ఏర్పడినట్లు సమాచారం.
 
ఇది ఇలా ఉండగా.. కేజ్రీవాల్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆదేశించారు. అవినీతిపరుడంటూ కేజ్రీవాల్‌ పదే పదే ఆరోపించిన ఏసీబీ చీఫ్‌ ఎంకే మీనానే ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. ఏసీబీ కార్యాలయం వెలుపల కపిల్  మిశ్రా మాట్లాడుతూ.. పూర్తిస్థాయి విచారణ కోసం ఏసీబీ మళ్లీ పిలుస్తుందని, తాను చేసిన ఆరోపణలపై లైడిటెక్టర్‌ టెస్ట్‌కు సిద్ధమని, కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్‌ కూడా టెస్ట్‌లో పాల్గొనాలని ఆయన సవాలు విసిరారు. 
 
రూ.400 కోట్ల మంచినీళ్ల ట్యాంకర్ల కుంభకోణంలో దర్యాప్తు నివేదికను కేజ్రీవాల్‌ తొక్కిపెట్టారంటూ ఆప్‌ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్‌ మిశ్రా ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేయడంతో పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేసినందుకుగానూ కపిల్‌ను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. తనపై ఆరోపణలకు కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. సత్యానిదే తుది విజయమని ట్వీట్‌ చేశారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు పరువు పోయె... ఐటీ ఉచ్చులో 12 మంది మంత్రులు 14 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌లు