Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రిన్స్ ఛార్లెస్ కారు మద్యం తాగి నడుస్తుందట..

Advertiesment
ప్రిన్స్ ఛార్లెస్ కారు మద్యం తాగి నడుస్తుందట..
, గురువారం, 14 అక్టోబరు 2021 (12:06 IST)
Vintage car
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ (72) కారు మద్యం తాగి నడుస్తుందట. తన కారు ఆస్టోన్‌ మార్టిన్‌లో వైన్‌ను పోస్తే నడుస్తోందని ప్రిన్స్ ఛార్లెస్‌ అన్నారు. తన మహాల్‌ ఉన్న పాత కారులో వైన్‌ను పోసి ప్రిన్స్ ఛార్లెస్ అలా లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు.
 
ప్రిన్స్‌ ఛార్లెస్‌కు ఆస్టోన్‌ మార్టిన్ కారు అంటే ఎంతో ఇష్టం. తన 21 ఏళ్ల వయసులో ఆ కారును అతడు బహుమతిగా అందుకున్నారు. ఆ తర్వాత దానిని తన అభిరుచులకు తగ్గట్టుగా మార్చుకున్నారు.
 
ఇంజినీర్లు ఎంతగానో శ్రమించి... ఈ కారును వైన్‌తో నడిచేలా రీడిజైన్‌ చేశారు. అప్పుడప్పుడు జున్ను తయారీ చేసే సమయంలో విరిగిన పాలను కూడా ఇంధన వాడుతున్నామని ప్రిన్స్‌ ఛార్లెస్ తెలిపారు. 
 
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో తన వంతు కృషిగా పెట్రోల్, డీజిల్‌కు బదులుగా వైన్‌ను ఉపయోగిస్తున్నాని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్‌ తెలిపాడు. ఈ నెల 31వ తేదీన వాతావరణ మార్పులపై యూఎన్‌ఓలో సమావేశం జరగనుంది. 
 
ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ... భూమిని రక్షించేందుకు యూఎన్‌వో జీవవైవిధ్య సదస్సులో ప్రపంచ దేశాలు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈరోజే NEET PG & ICSI CS రిజల్ట్స్...