Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భవనంపై నుంచి పడుతున్న బాలుడిని ఎలా పట్టుకున్నాడో చూడండి (వీడియో)

ఈజిప్టు దేశంలో బాలుడి ప్రాణాలను ఓ కానిస్టేబుల్ రక్షించాడు. మూడో అంతస్తు నుంచి కిందికి జారిపడుతున్న ఆ బాలుడుని పోలీసు తన ప్రాణాలకు తెగించి పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వై

భవనంపై నుంచి పడుతున్న బాలుడిని ఎలా పట్టుకున్నాడో చూడండి (వీడియో)
, శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (17:23 IST)
ఈజిప్టు దేశంలో బాలుడి ప్రాణాలను ఓ కానిస్టేబుల్ రక్షించాడు. మూడో అంతస్తు నుంచి కిందికి జారిపడుతున్న ఆ బాలుడుని పోలీసు తన ప్రాణాలకు తెగించి పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈజిప్టు నగరంలోని ఓ భవనం మూడో అంతస్తులో నిశ్చితార్థ వేడుక జరుగుతోంది. ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఓ బాలుడు మాత్రం ఆడుకుంటూ.. ఆ గది కిటికీ వద్దకు చేరుకుని అక్కడున్న కుర్చీ సహాయంతో కిటికీ పైకి ఎక్కాడు. అక్కడ నుంచి కిందికి చూడసాగాడు. 
 
ఈ విషయాన్ని భవనం కింద ఉన్న ఓ పోలీసు గమనించాడు. మిగతా పోలీసులను అప్రమత్తం చేశాడు. అంతలోనే ఆ ఐదేళ్ల బాలుడు కిందపడి పోతుండగా.. కమీల్ ఫాతీ గీడ్ అనే పోలీసు.. అతడి ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐడియా... అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై రూ.2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్