Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇచ్చింది బ్రేక్‌ఫాస్ట్.. పీకింది పెద్ద క్లాస్.. దటీజ్ మోదీ..!

సుఖాలు అనుభవించడానికి ఉత్తర ప్రదేశ్ ఓటర్లు బీజేపీకి ఓటెయ్యలేదని, రాష్ట్రాన్ని సమూలంగా మార్చడానికే వారు పార్టీకి అవకాశమిచ్చారు కాబట్టి పైరవీల జోలికి పోకుండా, ముఖమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఒత్తిడి పెట్టకుండా తన పని తాను చేసుకోనివ్వండి అంటూ ప్రధాని నరేంద

Advertiesment
PM Modi
హైదరాబాద్ , శుక్రవారం, 24 మార్చి 2017 (05:40 IST)
సుఖాలు అనుభవించడానికి ఉత్తర ప్రదేశ్ ఓటర్లు బీజేపీకి ఓటెయ్యలేదని, రాష్ట్రాన్ని సమూలంగా మార్చడానికే వారు పార్టీకి అవకాశమిచ్చారు కాబట్టి పైరవీల జోలికి పోకుండా, ముఖమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఒత్తిడి పెట్టకుండా తన పని తాను చేసుకోనివ్వండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎంపీలకు సుతిమెత్తగా క్లాస్ తీసుకున్నారు. గురువారం యూపీ బీజేపీ ఎంపీలను బ్రేక్‌పాస్ట్‌కి పిలిచిన మోదీ ఎంపీలకు మంచి ఉపాహారంతో పాటు యూపీ సీఎం యోగి జోలికి వెళ్లవద్దని, తనను ఏమాత్రం ఒత్తిడి పెట్టవద్దని హెచ్చరించారు.
 
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్బుత విజయం సాధించడానికి కష్టపడి పనిచేశారంటూ ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీలను ప్రశంసించిన మోదీ, యూపీని సమూలంగా మార్చడానికి అక్కడి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని ఎంపీలకు సూచించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి యోగి నుంచి ఏదైనా ప్రయోజనాలు పొందే ప్రయత్నాలకు దూరంగా ఉండమని ఎంపీలకు సూచించారు. ప్రజలకు సేవ చేయడానికే ఇంత ఘనవిజయాన్ని వారు అందించారని, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఇవ్వాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు. 
 
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సుపరిపాలనను అందించడానికి మాత్రమే మీరంతా సహకరించాలని, ఎట్టిపరిస్థిత్తుల్లోనూ ఆయనను కలిసి పైరవీలు చేయడానికి ప్రయత్నించవద్దని మోదీ బీజేపీ ఎంపీలను హెచ్చరించారు. యూపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదరగొడుతున్న యోగి.. వందమంది పోలీసుల సస్పెన్షన్.. అధికారులు పత్తిత్తులా?