Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదరగొడుతున్న యోగి.. వందమంది పోలీసుల సస్పెన్షన్.. అధికారులు పత్తిత్తులా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇచ్చిన మాటను ఉత్తర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలబెట్టుకుంటున్నారా? అభివృద్ధి, శాంతిభద్రతల స్థాపన తప్ప మరేమీ పట్టించుకోవద్దని మోదీ చెప్పిన సలహాను యోగి తూచా తప్

Advertiesment
UP CM yogi adityanath
హైదరాబాద్ , శుక్రవారం, 24 మార్చి 2017 (03:19 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇచ్చిన మాటను ఉత్తర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలబెట్టుకుంటున్నారా? అభివృద్ధి, శాంతిభద్రతల స్థాపన తప్ప మరేమీ పట్టించుకోవద్దని మోదీ చెప్పిన సలహాను యోగి తూచా తప్పకుండా పాటిస్తున్నట్లే ఉంది. ములాయం సింగ్ కుటుంబ పాలనలో కొనసాగిన దుర్మార్గ పాలన భరతం పట్టేలా యోగి మెరుపువేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
 
గత నాలుగురోజుల్లో దీనికి సంబంధించిన పెనుమార్పులను ఉత్తరప్రదేశ్ చూస్తోంది. ఒక దెబ్బకు రాష్టంలో గుట్కాను నిషేదించడం, చట్టవిరుద్ధ కబేళాలను మూసేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు విషయంలో జరుగుతున్న జాప్యం వంటి అంశాల్లో సీఎం స్థాయిలో ఎవరూ ఊహించని రీతిలో యోగి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఈ కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు వంద మంది పోలీసులను సస్సెండ్ చేసారు. అలాగే ఏడుగురు ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో ఎక్కువ మంది కానిస్టేబుల్‌ స్థాయిలోని వారే కావడం విశేషం.
 
ఇవన్నీ ఒక ఎత్తైతే ముఖ్యమంత్రి స్థాయిని కూడా పక్కన పెట్టి పోలీసు స్టేషన్ల తనిఖీకి యోగి సిద్ధపడటం ప్రజలను, అధికారులను కూడా నివ్వెరపరుస్తోంది. గురువారం లక్నోలోని హజ్రత్ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన యోగి అధికారులను హడలెత్తించారు. పోలీస్‌ స్టేషన్‌ లోని రికార్డులు, మినీ సెల్స్, లాకప్‌ సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. న్యాయాన్ని కాపాడేందుకు పోలీసులు అండగా నిలబడాలని ఆయన కోరారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే సీఎం స్టేషన్‌కు రావడంతో పోలీసులు పరుగులు పెట్టారు.  
 
దక్షిణాది రాష్టాల్లో తప్పితే ఉత్తరాదిలో పాలనలో ఇలాంటి మార్పులు ఇంత వేగంగా తీసుకురావడం చాలా వింతగానూ, అదే సమయంలో సరికొత్తగానూ ఉండటం ప్రజలకు సరికొత్త అనుభవం కలిగిస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కూలు పిల్లలు జీన్స్, స్కర్టులు వేయవద్దంటే ఒకే.. కానీ టీచర్లూ వేయవద్దంటే ఎలా చావడం?