Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూఎస్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ

Advertiesment
PM Modi
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:27 IST)
అమెరికా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరారు. బుధవారం ఉదయం గం.11.30 ప్రాంతంలో ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. మొత్తం మూడు రోజుల పాటు మోడీ యూఎస్‌లో పర్యటించనున్నారు.
 
ఈ సమయంలో ఆయన పలు కీలక భేటీల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యుఎస్‌లతో జరుగబోతోన్న మొదటి క్వాడ్ ఇన్ పర్సనల్ సమావేశంలో పాల్గొనడమే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. 
 
దీంతోపాటు, న్యూయార్క్‌లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీలో కూడా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇక, ఈ పర్యటనలో అగ్రరాజ్య దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా భారత ప్రధాని భేటీ అవుతారు. ఈ భేటీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ముఖ్యంగా, ఆప్ఘనిస్థాన్‌ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు హస్తగతం చేసుకోవడం, ఆ దేశ రాజకీయాల్లో పాకిస్థాన్, చైనా వంటి దేశాలు జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలపై ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అందుకే మోడీ, బైడన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త వేధింపులు.. కోపంతో మర్మాంగం కోసి హత్య