Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇల్లినాయిస్ నాట్స్ ఉమెన్ త్రోబాల్ టోర్నమెంట్: ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు మహిళలు

ఇల్లినాయిస్ నాట్స్ ఉమెన్ త్రోబాల్ టోర్నమెంట్: ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు మహిళలు
, మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:29 IST)
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నిర్వహించిన ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్ దిగ్విజయంగా జరిగింది. ఇల్లినాయిస్‌లో చికాగో నాట్స్ టీం నిర్వహించిన మిడ్ వెస్ట్రన్ త్రో బాల్ టోర్నమెంట్‌కు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం ఇల్లినాయిస్ మాత్రమే కాకుండా మిచిగాన్, ఇండియానా, విస్కాన్సిన్, మిస్సోరి తదితర రాష్ట్రాల నుంచి మహిళ జట్లు ఈ పోటీల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాయి.
webdunia
విస్కాన్సిన్ కు చెందిన ఎఎస్ సి టిగ్రెస్ టీమ్ టోర్నమెంట్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. ఇల్లినాయిస్ చెందిన హరికేన్స్ టీం రన్నర్ అప్‌గా నిలిచింది. నాట్స్ చికాగో కల్చరల్ కో-ఆర్డినేటర్ బిందు వీదులముడి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
 
దాదాపు 150 మందికి పైగా మహిళలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. నాట్స్ చికాగో నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జ, వేణు కృష్ణార్జుల, డాక్టర్ ప్రసుధ నున్నా, హరీష్ జమ్ముల, కార్తీక్ మోదుకూరి తదితరులు ఈ టోర్నమెంట్‌ విజయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
webdunia
స్థానిక తెలుగు వారిలో శిల్పా ఎర్రా, పూజా సావంత్, రోజా శీలంశెట్టి, బిందు బాలినేని, ప్రదీప్, ప్రియాంక గుప్తా, సంధ్య అంబటి, సుమతి నెప్పలి, రామ కొప్పక, రవి కిరణ్ ఆలా, శివ దేసు, రాజేష్ వీధులమూడి, ఆర్.కె బాలినేని, పండూ చెంగలశెట్టి, యాజ్నేష్, కిరణ్ అంబటి, తుషార్ సావంత్ ‌తో పాటు చాలా మంది ఈ టోర్నమెంట్  కోసం తమ వంతు సేవలు అందించినందుకు నాట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నం సరిగ్గా ఉడకకపోతే... క్యాన్సర్ ప్రమాదం.. ఇలా చేస్తే..? (video)