పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కాశ్మీర్ చిచ్చుకు ఆజ్యం పోశారు. ఇప్పటికే భారత్-పాకిస్థాన్‌ల మధ్య కాశ్మీర్‌ల మధ్య ఇప్పటికే కాశ్మీర్ అంశం చిచ్చుపెట్టిన నేపథ్యంలో తిరిగి తాను క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ముషారఫ్ చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఆయన.. కార్గిల్ యుధ్ధం గురించి ప్రస్తావించాడు.
తమ దేశం సదా శాంతి మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ.. భారత్ అదే పనిగా తమను బెదిరిస్తూ వస్తోందంటూ ఆరోపించాడు. ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఏపీఎంఎల్) చైర్మన్ అయిన 76 ఏళ్ళ ముషారఫ్… తమ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి దుబాయ్ నుంచి ఫోనులో మాట్లాడారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు వీలు కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం ముషారఫ్ చేసిన తొలి కామెంట్ ఇదే.
ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కాశ్మీరీ సోదరులకు అండగా ఉంటామని ముషారఫ్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ శాంతిని కోరుతున్నదంటే దాన్ని బలహీనతగా భావించరాదని అన్నారు. 2016 మార్చి నుంచీ దుబాయ్ లోనే ఉంటున్న ముషారఫ్.. 2007 లో దుబాయ్ విమానం ఎక్కక తప్పలేదు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు ఆయనపై అప్పటి ప్రభుత్వం రాజద్రోహం కేసు మోపింది. ప్రస్తుతం ముషారఫ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని పాకిస్తానీ మీడియా తెలిపింది.